ബന്ധപ്പെടുക പുതിയ വാർത്തകൾ
യഥാർത്ഥ വാർത്ത. വേഗത്തിലുള്ള വിവരം. ആന്ധ്രാപ്രദേശ് • തെലങ്കാന • ദേശീയ
രചയിതൃ പാനൽ
കടപ്പ

ఖాకీ చొక్కా వెనుక.. కరిగిపోయే కరుణామయ హృదయం.

പുന്നമി ന്യൂസ്‌റൂം പ്രസിദ്ധീകരിച്ചത്:
ఖాకీ చొక్కా వెనుక.. కరిగిపోయే కరుణామయ హృదయం.

വാർത്തയുടെ പ്രധാന കാര്യങ്ങൾ

  • కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం మద్దిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన గొల్లపల్లి లక్ష్మీదేవి అనే వృద్ధురాలి పరిస్థితి అత్యంత దయనీయం.
  • గతంలో కాలికి గాయం కావడం..
  • షుగర్ వ్యాధి తీవ్రత వల్ల ఆ కాలికి పురుగులు పట్టడంతో వైద్యులు ఆమె కాలును తొలగించారు.

కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం మద్దిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన గొల్లపల్లి లక్ష్మీదేవి అనే వృద్ధురాలి పరిస్థితి అత్యంత దయనీయం. గతంలో కాలికి గాయం కావడం.. షుగర్ వ్యాధి తీవ్రత వల్ల ఆ కాలికి పురుగులు పట్టడంతో వైద్యులు ఆమె కాలును తొలగించారు. వృద్ధాప్యంలో, కాలు లేక వైద్య ఖర్చుల కోసం ఆమె పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం.

ఆమె దీనస్థితిని చూసి చలించిపోయిన *కర్నూలు సీఐ శ్రీమతి విజయలక్ష్మి* గారు మానవత్వంతో ముందుకొచ్చారు. నిత్యం విధుల్లో బిజీగా ఉన్నప్పటికీ, తన సొంత ఊరిపై ఉన్న మమకారంతో ఆ వృద్ధురాలి వైద్య ఖర్చుల నిమిత్తం 12-7-2026 ఆదివారం రూ. 10,000 (పదివేల రూపాయలు) ఆర్థిక సాయం అందించారు.

గతంలో కూడా ఈ దివ్యాంగురాలికి విజయలక్ష్మి గారు ఆర్థిక సాయం అందించి అండగా నిలిచారు. హోదా పెరిగినా.. పుట్టిన గడ్డను, ఊరిలోని పేదల బాగోగులను మరువకుండా సాయం చేస్తున్న సీఐ విజయలక్ష్మి గారి సేవా నిరతికి మద్దిరెడ్డిపల్లి గ్రామ ప్రజలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

*హోదా కన్నా మానవత్వమే గొప్పదని నిరూపించిన CI విజయలక్ష్మి గారికి సెల్యూట్!*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *