ఖమ్మం జనవరి
(పున్నమి ప్రతినిధి)
ఖమ్మం నగరంలోని 53వ డివిజన్‌లో నెలకొన్న సమస్యలపై ఖమ్మం కార్పొరేషన్ కమిషనర్ శ్రీ అభిషేక్ అగస్త్య గారిని ఖమ్మం రెండవ పట్టణ బీజేపీ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ యాదవ్ ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం కలిసింది. డివిజన్‌లో ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సదుపాయాల సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి, త్వరితగతిన పరిష్కార చర్యలు చేపట్టాలని కోరారు.
ఈ కార్యక్రమం లో ఖమ్మం జిల్లా బీజేపీ సీనియర్ నాయకులు గేంటెల విద్యాసాగర్, ఖమ్మం బీజేపీ టూ టౌన్ ఉపాధ్యక్షులు పాశం శ్రీనివాస రెడ్డి, సాయి శ్రీ చర్ల వెంకట్ ఉపేంద్ర, శ్రీను, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు సానుకూలంగా స్పందించాలని నాయకులు విజ్ఞప్తి చేశారు.



