Monday, 8 December 2025
  • Home  
  • ఖమ్మం రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులని పరిశీలించిన బీజేపీ బృందం
- ఖమ్మం

ఖమ్మం రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులని పరిశీలించిన బీజేపీ బృందం

ఖమ్మం పున్నమి ప్రతి నిధి ఖమ్మం రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి అని బీజేపీ ప్రతి నిధి బృందం తెలిపింది. గురువారం పనుల పురోగతిని బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు, భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు ఖమ్మం రైల్వే స్టేషన్ అభివృద్ధి కమిటీ సభ్యురాలు శ్రీమతి మంద సరస్వతి లు ప్రత్యక్షంగా పరిశీలించారు. స్టేషన్ ప్రాంగణంలో జరుగుతున్న నిర్మాణ పనులను ఆయన రైల్వే అధికారులతో కలిసి సమీక్షించి, అవసరమైన సూచనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా రైల్వే వ్యవస్థను ఆధునిక సదుపాయాలతో తీర్చిదిద్దుతున్నాం. ఖమ్మం రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం రూ.25.41 కోట్ల నిధులు కేటాయించబడి, పనులు దశలవారీగా వేగంగా సాగుతున్నాయి. ఈ స్టేషన్ ద్వారా రోజూ 83 రైళ్లు ప్రయాణికులకు సేవలందిస్తున్నాయన్నారు. సూపర్‌ఫాస్ట్ రైళ్లు, ఎక్స్‌ప్రెస్ రైళ్లు, ప్రధాన నగరాలకు వెళ్లే పలు రైళ్లు ఇక్కడ ఆగుతుండటంతో ఖమ్మం రైల్వే స్టేషన్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది అని బీజేపీ నేతలు తెలిపారు. స్టేషన్ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా ప్రధాన భవనం ముఖద్వారం పునర్నిర్మాణం, ఆకర్షణీయమైన ప్రధాన ప్రవేశ ద్వారం నిర్మాణం, 12 మీటర్ల వెడల్పు గల ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం, రెండు ఎస్కలేటర్లు, రెండు లిఫ్టులు ఏర్పాటు, ఆధునిక వేటింగ్ హాల్స్, శుభ్రమైన వాష్‌రూములు, డిజిటల్ డిస్‌ప్లే బోర్డులు, విస్తృత పార్కింగ్ సదుపాయాలు వంటి పనులు జరుగుతున్నాయి. అదనంగా ప్రయాణికుల భద్రత కోసం సీసీటీవీ కెమెరాలు, సెక్యూరిటీ కంట్రోల్ రూమ్ వంటి ఆధునిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ప్రయాణికుల రక్షణ కోసం సిఆర్పిఎఫ్ పోలీస్ స్టేషన్ భవనం నిర్మాణం కూడా కొనసాగుతోంది. బీజేపీ ప్రభుత్వం ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా సేవలు అందించాలనే సంకల్పంతో ముందుకు సాగుతోంది. అభివృద్ధి పనులు పూర్తయిన తర్వాత ఖమ్మం రైల్వే స్టేషన్ తెలంగాణ రాష్ట్రంలో ఒక మోడల్ స్టేషన్‌గా నిలుస్తుంది. ఇది ఖమ్మం ప్రజలకు గర్వకారణంగా మారుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాలేరు నియోజకవర్గ మాజీ అభ్యర్థి నున్న రవికుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి గుత్తా వెంకటేశ్వర్లు, ఆచంటి కోటేశ్వరరావు, జిల్లా సెక్రటరీ తొండెపు సైదేశ్వరరావు, జిల్లా నాయకులు వేల్పుల సుధాకర్, మార్తి ప్రసాద్, ఈదుల భద్రం, గడిల నరేష్, ఆర్.వి.ఎస్. యాదవ్, దుద్దుకూరి కార్తీక్, పసుమర్తి సతీష్, డి.కొండ శ్యామ్, శాసనాల సాయిరాం, మండల నాయకులు పాలెపు రాము, కడుదుల ప్రభాకర్, నాగవల్లి రామచంద్రం, గుత్తా వంశీ, భూక్య బాలాజీ తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఖమ్మం
పున్నమి ప్రతి నిధి

ఖమ్మం రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి అని బీజేపీ ప్రతి నిధి బృందం తెలిపింది. గురువారం పనుల పురోగతిని బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు,
భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు ఖమ్మం రైల్వే స్టేషన్ అభివృద్ధి కమిటీ సభ్యురాలు శ్రీమతి మంద సరస్వతి లు ప్రత్యక్షంగా పరిశీలించారు. స్టేషన్ ప్రాంగణంలో జరుగుతున్న నిర్మాణ పనులను ఆయన రైల్వే అధికారులతో కలిసి సమీక్షించి, అవసరమైన సూచనలు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా రైల్వే వ్యవస్థను ఆధునిక సదుపాయాలతో తీర్చిదిద్దుతున్నాం. ఖమ్మం రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం రూ.25.41 కోట్ల నిధులు కేటాయించబడి, పనులు దశలవారీగా వేగంగా సాగుతున్నాయి. ఈ స్టేషన్ ద్వారా రోజూ 83 రైళ్లు ప్రయాణికులకు సేవలందిస్తున్నాయన్నారు. సూపర్‌ఫాస్ట్ రైళ్లు, ఎక్స్‌ప్రెస్ రైళ్లు, ప్రధాన నగరాలకు వెళ్లే పలు రైళ్లు ఇక్కడ ఆగుతుండటంతో ఖమ్మం రైల్వే స్టేషన్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది అని బీజేపీ నేతలు తెలిపారు.
స్టేషన్ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా ప్రధాన భవనం ముఖద్వారం పునర్నిర్మాణం, ఆకర్షణీయమైన ప్రధాన ప్రవేశ ద్వారం నిర్మాణం, 12 మీటర్ల వెడల్పు గల ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం, రెండు ఎస్కలేటర్లు, రెండు లిఫ్టులు ఏర్పాటు, ఆధునిక వేటింగ్ హాల్స్, శుభ్రమైన వాష్‌రూములు, డిజిటల్ డిస్‌ప్లే బోర్డులు, విస్తృత పార్కింగ్ సదుపాయాలు వంటి పనులు జరుగుతున్నాయి. అదనంగా ప్రయాణికుల భద్రత కోసం సీసీటీవీ కెమెరాలు, సెక్యూరిటీ కంట్రోల్ రూమ్ వంటి ఆధునిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ప్రయాణికుల రక్షణ కోసం సిఆర్పిఎఫ్ పోలీస్ స్టేషన్ భవనం నిర్మాణం కూడా కొనసాగుతోంది.
బీజేపీ ప్రభుత్వం ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా సేవలు అందించాలనే సంకల్పంతో ముందుకు సాగుతోంది. అభివృద్ధి పనులు పూర్తయిన తర్వాత ఖమ్మం రైల్వే స్టేషన్ తెలంగాణ రాష్ట్రంలో ఒక మోడల్ స్టేషన్‌గా నిలుస్తుంది. ఇది ఖమ్మం ప్రజలకు గర్వకారణంగా మారుతుంది అని అన్నారు.

ఈ కార్యక్రమంలో పాలేరు నియోజకవర్గ మాజీ అభ్యర్థి నున్న రవికుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి గుత్తా వెంకటేశ్వర్లు, ఆచంటి కోటేశ్వరరావు, జిల్లా సెక్రటరీ తొండెపు సైదేశ్వరరావు, జిల్లా నాయకులు వేల్పుల సుధాకర్, మార్తి ప్రసాద్, ఈదుల భద్రం, గడిల నరేష్, ఆర్.వి.ఎస్. యాదవ్, దుద్దుకూరి కార్తీక్, పసుమర్తి సతీష్, డి.కొండ శ్యామ్, శాసనాల సాయిరాం, మండల నాయకులు పాలెపు రాము, కడుదుల ప్రభాకర్, నాగవల్లి రామచంద్రం, గుత్తా వంశీ, భూక్య బాలాజీ తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.