ఖమ్మం మార్చి
(పున్నమి జిల్లా ఇంచార్జి )
ఖమ్మం నగరంలో ఖమ్మం టూ టౌన్ బీజేపీ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ శిబిరం శనివారం విజయవంతంగా జరిగింది. తెలంగాణ రాష్ట్ర బీజేపీ సూచన మేరకు ఏర్పాటు చేసిన ఈ శిక్షణ కార్యక్రమం ఎన్‌ఎస్‌పి క్యాంపులోని రామాలయం ఫంక్షన్ హాల్‌లో టూ టౌన్ అధ్యక్షుడు ధనియాకుల వెంకట్ నారాయణ అధ్యక్షతన నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గేంటెల విద్యాసాగర్, కిసాన్ మోర్చా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు, రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసు దేవరావు ముఖ్య వక్తలుగా పాల్గొన్నారు. వారు పార్టీ సిద్ధాంతాలు, సంఘటిత శక్తి, కార్యకర్తల పాత్ర, ప్రజా సమస్యలపై పోరాటం వంటి పలు అంశాలపై కార్యకర్తలకు వివరణాత్మకంగా మార్గనిర్దేశం చేశారు.
శిక్షణ శిబిరంలో మండదపు సుబ్బారావు, రుద్రగాని మాధవ, శ్రీనివాస్ రెడ్డి, శ్రీమతి శ్రీలత, శ్రీమతి ఉపేందరమ్మ, నాగరాజు, రవి రాదోడ్, మట్ట దుర్గప్రసాద్, దాసరి వీరభద్రం (రిటైర్డ్ సి.ఐ), వేల్పుల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతంగా సాగడంతో కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.



