ఖమ్మం మార్చి
(పున్నమి జిల్లా ఇంచార్జి )
ఖమ్మం రూరల్ మండలంలో డాక్టర్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ శిబిరం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రూరల్ మండల బీజేపీ అధ్యక్షులు జాటోతూ మధు నాయక్ అధ్యక్షత వహించారు.
ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు ప్రసంగిస్తూ పార్టీ బలోపేతానికి శిక్షణ శిబిరాలు కీలకమని తెలిపారు.
కార్యక్రమంలో సీనియర్ నాయకులు వంకలంక సుబ్రహ్మణ్యం, నకిరికంటి వీర భద్రం, నల్లమాస శ్రీనివాస్, కందుల శ్రీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


