Wednesday, 18 March 2026
  • Home  
  • ఖమ్మం భూదాన్ భూములపై హైకోర్టు స్టేటస్ కో – కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ
- ఖమ్మం

ఖమ్మం భూదాన్ భూములపై హైకోర్టు స్టేటస్ కో – కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

ఖమ్మం, మార్చి ( పువ్వాడ నాగేంద్ర కుమార్ పున్నమి జిల్లా ఇంచార్జి ) ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్ భూముల వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. భూదాన్ భూములపై యథాస్థితి (స్టేటస్ కో) కొనసాగించాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో బాధితులు హైకోర్టును ఆశ్రయించి, అసలైన లబ్ధిదారులను గుర్తించాలని, ఇళ్ల స్థలాలు కోల్పోయిన అందరికీ భూదాన్ భూముల్లో ఇళ్ల స్థలం మరియు ఇళ్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. విచారణ అనంతరం కోర్టు, కేవలం 311 మందికే కాకుండా, అక్కడ ఇళ్లు కోల్పోయిన ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని స్పష్టం చేసింది. అన్ని బాధితులను గుర్తించి వారికి తగిన ఇళ్ల స్థలం, నివాస సౌకర్యాలు కల్పించాల్సిందిగా సూచించింది. అలాగే భూదాన్ భూములపై ఎటువంటి మార్పులు చేయకుండా స్టేటస్ కో కొనసాగించాలని ఖమ్మం జిల్లా కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్లకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ పరిణామం రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.

ఖమ్మం, మార్చి
( పువ్వాడ నాగేంద్ర కుమార్
పున్నమి జిల్లా ఇంచార్జి )

ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్ భూముల వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. భూదాన్ భూములపై యథాస్థితి (స్టేటస్ కో) కొనసాగించాలని కోర్టు ఆదేశించింది.

ఈ కేసులో బాధితులు హైకోర్టును ఆశ్రయించి, అసలైన లబ్ధిదారులను గుర్తించాలని, ఇళ్ల స్థలాలు కోల్పోయిన అందరికీ భూదాన్ భూముల్లో ఇళ్ల స్థలం మరియు ఇళ్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
విచారణ అనంతరం కోర్టు, కేవలం 311 మందికే కాకుండా, అక్కడ ఇళ్లు కోల్పోయిన ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని స్పష్టం చేసింది. అన్ని బాధితులను గుర్తించి వారికి తగిన ఇళ్ల స్థలం, నివాస సౌకర్యాలు కల్పించాల్సిందిగా సూచించింది.
అలాగే భూదాన్ భూములపై ఎటువంటి మార్పులు చేయకుండా స్టేటస్ కో కొనసాగించాలని ఖమ్మం జిల్లా కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్లకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఈ పరిణామం రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.