ఖమ్మం జనవరి
(పున్నమి జిల్లా స్థాఫర్)
ఖమ్మం నగరంలో బీజేపీ ఖమ్మం రెండవ పట్టణ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ సీనియర్ నాయకులు గేంటెల విద్యా సాగర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా స్వామి వివేకానందుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. యువతకు వివేకానందుని ఆదర్శాలు మార్గదర్శకమని నేతలు పేర్కొన్నారు.
కార్యక్రమంలో అల్లిక అంజయ్య యాదవ్, జ్యోతుల యుగంధర్ నాయుడు, డీకొండ శ్యాం, గజ్జల శ్రీనివాస్, పాశం శ్రీనివాస్ రెడ్డీ, దాసరి మధు, దాసరి వీరభద్రం (రిటైర్డ్ సీఐ), ఉపేంద్రమ్మ తదితరులు పాల్గొన్నారు.
Uploaded Video:


