పున్నమి Daily న్యూస్
ప్రతినిథి:ఖమ్మం
T.Ravinder
ఖమ్మం నగరం లో స్తంభాద్రి ఉత్సవ కమిటీ సమావేశం
*ఆగస్ట్ 27గణేష్ చతుర్థి, సెప్టెంబర్ 6 నిమార్జనం – వినోద్ లాహోటి,అధ్యక్షులు*
ఖమ్మం నగరం లో స్తంభాద్రి ఉత్సావ కమిటీ సమావేశం అధ్యక్షులు వినోద్ లాహోటి గారి అధ్యక్షతన ఉత్సావ కమిటీ కార్యాలయం లో నిర్వహించడం జరిగింది,అధ్యకులు వినోద్ లాహోటి ప్రధానకార్యదర్శి కీసర జైపాల్ రెడ్డి మాట్లాడుతు ఈ సంవత్సరం ఖమ్మం నగరం లో గణేష్ ఉత్సవాలు *ఆగస్ట్ 27వ తేదీ బుధవారం గణేష్ చతుర్థి పండుగ , సెప్టెంబరు 6వ తేదీ శనివారం నిమర్జన కార్యక్రమం* నిర్వహించుకోవాలని,పర్యావరణ పరి రక్షణ లో భాగం గా మట్టి విగ్రహాలకు ప్రాధాన్యత ఇస్తూ మన సంస్కృతి సంప్రదాయాలు పాటిస్తూ గణేష్ చతుర్థి జరుపుకోవాలని , మంటప నిర్వాహకులు అందరు తమ గణేష్ మంటపాల వద్ద సూచి శుభ్రత పాటిస్తూ భక్తులకు అసౌకర్యం కలుగ కూడా చుసుకోవాలని,మంటపం ఎదురుగా కాషాయ ధ్వజం ఏర్పాటు చేయాలని సూచించారు, త్వరలో స్తంభాద్రి ఉత్సవ కమిటీ జిల్లా కలెక్టర్ గారిని పోలీస్ కమిషనర్ గారిని కలిసి ప్రభుత్వం ద్వారా ప్రతి సంవత్సరం లాగానే ఇచ్చే సౌకర్యాలు, ఏర్పాట్లు చేయాలని కోరుతాం అని తెలియజేసారు, ఈ కార్యక్రమంలో గెంటేల విద్యాసాగర్ గారు,*వేల్పుల సుధాకర్ *,అల్లిక అంజయ్య ,ఈశ్వర ప్రగడ రామారావు, శ్రీ హరి ,పిల్లల మర్రి వెంకట్ పాల్గొన్నారు.

