ఖమ్మం పున్నమి ప్రతి నిధి
ఖమ్మం నగరము లోని టూ టౌన్ పరిధిలో గల 15 కార్పొరేషన్ స్థానాల్లో బీజేపీ విజయమే తన లక్ష్యం అని ఖమ్మం టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ యాదవ్ తెలియజేసారు
ప్రతి డివిజన్లో పోలింగ్ బూత్ అధ్యక్షులను కలిసి వారి పోలింగ్ బూత్ లో, ఆ డివిజన్లో ఉన్న సమస్యలను తెలుసుకొని పరిష్కారం దిశగా చెప్పట్టిన డివిజన్ యాత్ర కార్యక్రమం గురువారం 2వ రోజు పర్యటన టూ టౌన్ పరిధిలో ఉన్న 44వ డివిజన్లో ఆ డివిజన్ ఇంచార్జి ఖమ్మం టూ టౌన్ ఉపాధ్యక్షులు,పాశం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగింది, ఈ సందర్భంగా 44వ డివిజన్లో దావత్ ట్రస్టు ఢిల్లీ వారిపేరుతో ఉన్న ఓ ఇల్లుని మజీద్ పేరుతో పెద్ద సౌండ్ లతో మైకులు పెట్టి డివిజన్ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఈ సమస్య గురించి సిపి గారికి కోర్టులో కూడా నడుస్తుందని ఈ సమస్య పరిష్కారం అయితే డివిజన్ ప్రజలందరూ భారతీయ జనతా పార్టీకి మద్దతుగా ఉంటామని, ఆ డివిజన్ ప్రజలు వాపోయారు, అలాగనే అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న పోలింగ్ బూత్ అధ్యక్షులుని పరామర్శించడం జరిగింది ఈ కార్యక్రమంలో రుద్ర గాని మాధవ్,యుగంధర్ నాయుడు, దాసరి వీరభద్రం, జిల్లెల్ల నాగరాజు, దాసరి మధు, ఉపేంద్ర, వంశీ, ఉన్నారు,


