పున్నమి
ఖమ్మం
ఖమ్మం జిల్లా బీజేపీ పార్టీ ఆదేశాల మేరకు ఖమ్మం టూ టౌన్ మండల కార్యవర్గ సమావేశం అధ్యక్షుడు ధనియాకుల వెంకటనారాయణ అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశంలో ఖమ్మం బిజెపి టూ టౌన్ పరిధిలోని 15 డివిజన్లకు సంబంధించిన పూర్తి పోలింగ్ బూత్ కమిటీలు, శక్తి కేంద్ర ఇన్‌చార్జిలు పాల్గొన్నారు. వారి వారి డివిజన్ల సమస్యలను తెలుసుకొని పరిష్కార దిశగా ఖమ్మం జిల్లా బీజేపీ పార్టీకి మరియు ప్రభుత్వ అధికారులకు తెలియజేసే విధానం గురించి చర్చించారు.
పార్టీ అభివృద్ధి కోసం, రానున్న ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో విజయాన్ని లక్ష్యంగా పెట్టుకొని సీనియర్ నేతల సూచనల మేరకు దిశా నిర్దేశం చేశారు.
అనంతరం
ఖమ్మం టూ టౌన్ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ గా జ్యోతుల యుగంధర్ నాయుడు ని నియమిస్తూ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ యాదవ్ నియామక పత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు గంటేల విద్యాసాగర్, ఒక్కలంక సుబ్రహ్మణ్యం, మేకల నాగేందర్, జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి నల్లగట్టు ప్రవీణ్, కృష్ణ చారి, రుద్రగాని మాధవ్, జ్యోతుల యుగంధర్, నక్క రవి గౌడ్, సురేష్ గౌడ్, తాజనూత్ భద్రం, శ్రీనివాసరెడ్డి, లలిత, ఉపేంద్ర, వెంకట్ మహేందర్, వీరభద్రం, నాగరాజు, చిన్ని కృష్ణ, వెంకట్, గంగాధర్, మేఘన మరియు పోలింగ్ బూత్ అధ్యక్షులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


