ఖమ్మం, జనవరి
(పున్నమి దిన పత్రిక జిల్లా ప్రతినిధి)
చందువుల తల్లి సరస్వతి మాత జన్మదినాన్ని పురస్కరించుకొని వసంత పంచమి వేడుకలు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా శుక్రవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.
సత్తుపల్లి, మధిర, పాలేరు, వైరా, ఖమ్మం నియోజకవర్గ కేంద్రాలతో పాటు పలు ప్రాంతాల్లో భక్తులు ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
ప్రత్యేకంగా ఖమ్మం నగరంలోని గుట్టల బజార్‌లో ఉన్న శ్రీ రామకృష్ణ విద్యాలయంలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాసర నుంచి తీసుకొచ్చిన సరస్వతి దేవి ఫోటోలను, అక్షితలను కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులకు పంపిణీ చేశారు.
విద్య, జ్ఞానం, విజ్ఞానానికి ప్రతీక అయిన సరస్వతి మాత ఆశీస్సులతో విద్యార్థులు ఉత్తమ భవిష్యత్తు సాధించాలని భక్తులు ప్రార్థించారు.



