ఖమ్మం అక్టోబర్
(పున్నమి ప్రతి నిధి)
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా దీపావళి పండుగ ఘనంగా జరిగింది. ప్రతి ఊరు, ప్రతి వీధి, ప్రతి ఇంటిలో వెలుగుల పండుగ అంబరాన్ని అంటిన వేడుకలతో సాగింది. ప్రజలు కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులతో కలిసి దీపాలు వెలిగించి, పటాకులు కాల్చి ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకున్నారు.
ఈ సందర్భంగా వివిధ రాజకీయ పార్టీ నాయకులు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. బీజేపీ తరఫున తెలంగాణ రాష్ట్ర నాయకులు భూపాలపల్లి ఇంచార్జి గల్లా సత్యనారాయణ, కిసాన్ మోర్చా రాష్ట్ర మాజీ అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, బీజేపీ నేత తాండ్రా వినోద్ రావు, ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.
తెలుగు దేశం పార్టీ తరఫున నల్లమల్ల రంజిత్ (ఖమ్మం బాలయ్య), కేతినేని హరీష్ దీపావళి పండుగ ప్రజలకు సంతోషం, సిరిసంపదలు తీసుకురావాలని ఆకాంక్షించారు.
బీఆర్‌ఎస్ నాయకులు తాత మధు, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ పండుగ రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.
కాంగ్రెస్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గ ప్రసాద్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
ప్రజలు ఒకరికొకరు పూలు, పటాకులు, మిఠాయిలతో దీపావళి శుభాకాంక్షలు పంచుకున్నారు. చిన్నారులు పటాకులతో, పెద్దలు కుటుంబ సమేతంగా దీపాల వెలుగులో ఆనందం పంచుకున్నారు. ఖమ్మం జిల్లా మొత్తం పండుగ వాతావరణంతో కళకళలాడింది.

