ఖమ్మం: మార్చి
(పున్నమి జిల్లా ఇంచార్జి )
ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఖమ్మం అర్బన్ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా నియామకమైన ఆచంటి కోటేశ్వరరావును ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం పెద్దలు ఆయనకు శాలువా కప్పి అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పులిపాటి ఎడ్యుకేషనల్ సొసైటీ అధినేత పులిపాటి ప్రసాద్, ప్రముఖ న్యాయవాది నోముల వెంకటేశ్వర్లు, డోకూపర్తి రవీందర్, కొంకిమళ్ల మృత్యుంజయతో పాటు పలువురు ఆర్యవైశ్య సంఘం ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆచంటి కోటేశ్వరరావు బీజేపీ ఖమ్మం అర్బన్ ప్రధాన కార్యదర్శిగా నియమితులవడం ఆర్యవైశ్య సమాజానికి గర్వకారణమని తెలిపారు. సమాజ అభివృద్ధి, ప్రజా సేవలో ఆయన మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమం స్నేహపూర్వక వాతావరణంలో జరిగింది.


