ఖమ్మం పున్నమి ప్రతినిధి
ఖమ్మం నగరాన్ని అభివృద్ధి చేసాం అని గొప్పలు చెప్పుకుంటూన్న జిల్లా మంత్రులు వర్షా కాలం లో ఒక సారి ఖమ్మం పాత బస్ స్టాండ్, మరియు ఖమ్మం రోడ్ల ని పరిశీలిస్తే వారు అభివృద్ధి ఎంత వరకు చేసారో వారికే అర్ధం అవుతుంది అని ఖమ్మం టూ టౌన్ బిజెపి అధ్యక్షులు ధనియాకుల వెంకట నారాయణ యాదవ్ అన్నారు. వర్షం కురిస్తే డ్రైనేజ్ లో నీరు రోడ్ల మీద కి వచ్చి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అని అయన ఆవేదన వ్యక్తం చేసారు. ఇప్పుడు వర్షాకాలం ప్రారంభం లోనే సమస్య లు ఇలా ఉంటే రాబోయే కాలం లో ఇంకా సమస్య తీవ్రంగా ఉంటుంది అని అన్నారు. మంత్రులు, అధికారులు వెంటనే స్పందించి వర్షాల వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులని పరిష్కరించాలి అని ధనియాకుల వెంకట్ నారాయణ యాదవ్డ్ డిమాండ్ చేసారు.


