పున్నమి ఖమ్మం జిల్లా ప్రతి నిధి
బీజేపీ జాతీయ నాయకుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి ఖమ్మంలో ప్రధాని నరేంద్ర మోదీ గారి ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని జిల్లా బీజేపీ నాయకులతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నేత కనమర్లపూడి ఉపేందర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారి ఇంట్లోనే ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని జిల్లా నాయకులతో కలిసి వీక్షించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు, నున్న రవి కుమార్, నంబూరి రామలింగేశ్వరావ్, ఈవి రమేష్, విజయ్ రాజు, అల్లిక అంజయ్య, గుత్త వెంకటేశ్వర్లు, దుద్దుకూరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


