మొంథా తుపాను ప్రభావం నేపథ్యంలో ఎన్‌టీఆర్ జిల్లాలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ ఆధ్వర్యంలో అధికారులు క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టారు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామ అక్టోబర్28 (రిపబ్లిక్ న్యూస్)
జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియ, ఆర్‌డీవోలు కె. చైతన్య (విజయవాడ), కె. బాలకృష్ణ (నందిగామ), కె. మాధురి (తిరువూరు)లు పునరావాస కేంద్రాలు, ముప్పు ఉన్న ప్రాంతాలను పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. పునరావాస కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, ఆహారం, వైద్యసదుపాయాలు తదితర ఏర్పాట్లు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించారు. మండల, గ్రామ, వార్డు స్థాయి విపత్తు స్పందన బృందాలను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. జేసీ ఇలక్కియ కంచికచర్ల మండలంలోని పరిటాల చెరువును, స్థానిక పునరావాస కేంద్రాన్ని, వాటర్ స్టోరేజ్ ట్యాంక్‌ను పరిశీలిం చారు. అలాగే నందిగామ మండలంలో ఐతవరం గ్రామంలోని వరి పొలాలు, రైతు సేవా కేంద్రం, డీవీఆర్ కాలనీ వంటివి పరిశీలించారు.
ప్రజలు తుపాను సమయంలో అప్రమత్తంగా ఉండి, ప్రభుత్వ సూచనలు పాటించాలని, అవసరమైతే పునరావాస కేంద్రాలను వినియోగించు కోవాలని జాయింట్ కలెక్టర్ సూచించారు.


