పేదవాళ్తేర్ పెదజాలారిపేటకు సంబందించిన రామోలు ఎల్లాజీ (వయస్సు-28) సంప్రదాయ మత్స్యకారుడు నిన్న (24-10-2025) ఉదయం సుమారుగా నాలుగు గంటలకు చేపలవేటకు వెళ్లి ఇప్పటికి తిరిగిరాలేదు.
భయందోళనలో కుటుంబ సభ్యులు సహాయ సహకారాలు అందించాలని ప్రభుత్వ అధికారాలకు వేడుకొలు.
పెదజాలారిపేటకు సంబందించిన రామోలు ఎల్లాజీ (వయస్సు-28) అనే సంప్రదాయ మత్స్యకారుడు ఊర్లో అందరిలాగే నిన్న (24-10-2025) ఉదయం సుమారుగా నాలుగు గంటలకు ఒక్కడే పైబర్ బోటు మీద సూరలు (ట్యూనా) చేపలవేటకు వెళ్లడం జరిగింది.
తీరం నుండి సుమారుగా 30 నాటికల్ మైల్ దూరం వెళ్ళినట్లు తోటి మత్స్యకారులు చెబుతున్నారు. తిరిగివచ్చే సమయంలో వాతావరణం అనుకుంలించిగా మరియు గమ్యాన్ని గుర్తించే పరికరాలు (GPS) లాంటివి లేనుందున ఒడ్డుకు రాలేకపోయాడు అని తెలుస్తుంది.
ఇతనను వెతకడానికి ఈరోజు ఉదయం ఇక్కడ నుండి ఎనిమిది బోట్లులలో తోటి మత్స్యకారులు వెళ్లడం జరిగింది. అయన ఇప్పటికి ఆ తప్పిపోయన మత్స్యకారుడు ఆచూకీ లభ్యంకాలేదు. వెతకడానికి వెళ్లిన కొన్ని బోట్లు తీరంనకు తిరిగివచ్చేయడం జరిగింది. మిగిలిన బోట్లు ఆ మత్స్యకారుడు ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
ఇదే విషయం పైన మత్స్యశాఖకు సంబందించిన జాయింట్ డైరెక్టర్ లక్ష్మణ్ రావు ఉదయం ఇక్కడకు వచ్చి సంఘటనకు సంబందించిన వివరాలును అడిగి తెలికొని వెళ్లడం జరిగింది.*
ఇతను ఆచూకీ తెలిసికోవడానికి కుటుంబ సభ్యులు ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.


