గాజువాక అక్టోబర్ (పున్నమి ప్రతినిధి)
గాజువాక నియోజకవర్గం, పెదగంట్యాడ, *75* వ వార్డ్ నందు WHEELS OF FIRE స్కేటింగ్ క్లబ్ నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా, *డైరెక్టర్* – *ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్*, విశాఖ జిల్లా తెలుగుయువత ప్రధానకార్యదర్శి *మొల్లి పెంటిరాజు* పాల్గొన్నారు. విశాఖపట్నం జిల్లా రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ మరియు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జిల్లాస్థాయి పోటీలలో పెదగంట్యాడ ప్రాంతానికి చెందిన విద్యార్థిని, విద్యార్థులు పతాక విజేతలగా నిలిచారు. ఈ ప్రతిభావంతులైన స్కేటర్లు వారి కోచ్ *సంగం మురళి* @ WHEELS OF FIRE స్కేటింగ్ క్లబ్ మార్గదర్శకత్వం కారణంగా, రాష్ట్ర పోటీలలో, విశాఖపట్నం జిల్లాకు ప్రాతినిధ్యం వహించడానికి ఎంపికయ్యారు. నవంబర్ నెలలో కాకినాడలో జరిగే *రాష్ట్ర స్థాయి పోటీలకు* వీరు ఎంపికయ్యారు. క్రీడాకారులు శుభాకాంక్షలు తెలుపుతూ, వారికి తగిన ప్రోత్సాహకాలు అందిస్తానని, వీరు రాష్ట్ర స్థాయిలో కూడా పతకాలు సాధించాలని ఈ సందర్భంగా కోరారు.
*విశాఖపట్నం జిల్లా రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ పతాక విజేతలు:*
1. *6-8 పురుష క్వాడ్:* అండిబోయిన హిమాన్ష్ (1 స్వర్ణం & 1 రజతం)
2. *10-12 మహిళా క్వాడ్:* జెంజి లక్ష్మీ సాయి లౌక్య (3 రజతాలు)
3. *10-12 మహిళా ఇన్లైన్:* కాసిన సూర్య నందన (1 కాంస్య)
4. *12-15 మహిళా ఇన్లైన్:* అండిబోయిన హేమ వర్షిణి (1 రజతం & 1 కాంస్య)
5. *15-18 మహిళా క్వాడ్:* పోలిశెట్టి శ్రుతి సంయుక్త (2 కాంస్యాలు)
*స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జిల్లా పోటీల పతక విజేతలు:*
1. *17 ఏళ్లలోపు:* పోలిశెట్టి శ్రుతి సంయుక్త (2 రజతాలు)
2. *14 ఏళ్లలోపు:* అండిబోయిన హేమ వర్షిణి (1 రజతం & 1 కాంస్య పతకం)
ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు, కోచ్ లు, క్రీడాకారులు, తల్లితండ్రులు పాల్గొన్నారు.


