అమడగూరు: క్రీడలు మానసిక,శారీరక ఉల్లాసానికి దోహదడతాయని,క్రీడా స్ఫూర్తితో పోటీల్లో క్రీడాకారులు పాల్గొనాలని మండల స్పెషల్ ఆఫీసర్ రాజశేఖర్ రెడ్డి,ఎంపీడీవో మునెప్ప పేర్కొన్నారు.శనివారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో స్థానిక పాఠశాల,ఆదర్శ పాఠశాల విద్యార్థులకు వాలీబాల్ క్రీడా పోటీలను నిర్వహించారు.ముందుగా అధికారులు,ఉపాధ్యాయులు జట్లకు శుభాకాంక్షలు తెలుపుతూ టాస్ వేసి క్రీడను ప్రారంభించారు.ఈ సందర్భంగా క్రీడ ఉపాధ్యాయులు మాట్లాడుతూ…ఈ క్రీడలలో మండల స్థాయిలో గెలుపొందిన విద్యార్థులను,కదిరి డివిజన్ స్థాయికి పంపిస్తామని,డివిజన్ స్థాయిలో గెలుపొందిన విద్యార్థులను జిల్లా,రాష్ట్ర స్థాయిలో పోటీలకు పంపించడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో క్రీడ ఉపాధ్యాయులు మునెప్ప,లక్ష్మీనరసమ్మ,పంచాయతీ కార్యదర్శి మమత,ఉపాధ్యాయులు,తదితరులు పాల్గొన్నారు.

క్రీడలు మానసిక,శారీరక ఉల్లాసానికి దోహదం.