Wednesday, 1 April 2026
  • Home  
  • క్రికెట్ బెట్టింగ్‌పై కఠిన చర్యలు: ఎస్ఐ శివరాకేష్ హెచ్చరిక
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

క్రికెట్ బెట్టింగ్‌పై కఠిన చర్యలు: ఎస్ఐ శివరాకేష్ హెచ్చరిక

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఏప్రిల్ 1 (పున్నమి ప్రతినిధి) స్థానిక పోలీస్ స్టేషన్‌లో మంగళవారం ఎస్ఐ శివరాకేష్ మాట్లాడుతూ ఐపీఎల్ సీజన్ సందర్భంగా ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు. ఇటువంటి కార్యకలాపాలు అప్పుల పాలయ్యే ప్రమాదం ఉందన్నారు. వేసవిలో పిల్లలు సముద్రాలు, నదులు, చెరువుల్లో ఈతకు వెళ్లే సమయంలో జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించారు. మైనర్లకు మోటార్ బైకులు ఇవ్వొద్దని, ప్రమాదాలైతే తల్లిదండ్రులే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు. సోషల్ మీడియాలో అన్యులతో చాటింగ్ ప్రమాదకరమని, తల్లిదండ్రులు పిల్లలపై నిఘా పెట్టాలని సూచించారు. చట్టవ్యతిరేక చర్యలు గమనిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఏప్రిల్ 1 (పున్నమి ప్రతినిధి)
స్థానిక పోలీస్ స్టేషన్‌లో మంగళవారం ఎస్ఐ శివరాకేష్ మాట్లాడుతూ ఐపీఎల్ సీజన్ సందర్భంగా ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు. ఇటువంటి కార్యకలాపాలు అప్పుల పాలయ్యే ప్రమాదం ఉందన్నారు. వేసవిలో పిల్లలు సముద్రాలు, నదులు, చెరువుల్లో ఈతకు వెళ్లే సమయంలో జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించారు. మైనర్లకు మోటార్ బైకులు ఇవ్వొద్దని, ప్రమాదాలైతే తల్లిదండ్రులే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు. సోషల్ మీడియాలో అన్యులతో చాటింగ్ ప్రమాదకరమని, తల్లిదండ్రులు పిల్లలపై నిఘా పెట్టాలని సూచించారు. చట్టవ్యతిరేక చర్యలు గమనిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.