పున్నమి న్యూస్ (కోనసీమ), సీనియర్ జర్నలిస్ట్ రమణ: పి.గన్నవరం నియోజకవర్గం అయినవిల్లి మండలం క్రాప గ్రామ పంచాయితీ వద్ద ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా చేసే సేవా కార్యక్రమాల్లో భాగంగా అయినవిల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్యాధికారి డాక్టర్ విజయ్ నేతృత్వంలో గ్రామ సర్పంచ్ బొబ్బిలి సీతా దేవి అయ్యప్ప అధ్యక్షతన స్వస్త్ నారీ స్వశక్త్ పరివార్ అభియాన్ లో భాగంగా శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. అయినవిల్లి మండల బీజేపీ అధ్యక్షులు యనమదల వెంకటరమణ ఆధ్వర్యంలో కో ఇంచార్జి గనిశెట్టి వెంకటేశ్వరరావు సందర్శించారు. మొదటగా వారు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో గనిశెట్టి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈ వైద్య శిబిరాలు మహిళలకు ఆరోగ్యమే ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నాయని అన్నారు. మహిళలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వెంకటరమణ మాట్లాడుతూ జీఎస్టీ తగ్గించి పేద, మధ్య తరగతి ప్రజలకు ఉపశమనం ఇచ్చారన్నారు. జీఎస్టీ పై ప్రజలకు ఉన్న అపోహలకు సమాధానం చెప్పారు. విద్యార్థులకు మంచి పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నారని అన్నారు. పోషణ్ అభియాన్ పథకం ద్వారా బాలింతలకు పౌష్టికాహార పంపిణీ జరుగుతుంది అన్నారు. అనంతరం సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్ కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం అంగన్వాడి సిబ్బంది ఏర్పాటు చేసిన స్టాల్ ను పరిశీలించి వారు చేసిన పౌష్టికాహార పిండి వంటలు రుచి చూశారు. ఈ కార్యక్రమంలో క్రాప శంకరాయ గూడెం సర్పంచ్ బొక్క కామేశ్వరరావు, ఎంపీటీసీ సానబోయిన శ్రీనివాసరావు, బొబ్బిలి రాంబాబు, సూరిబాబు, సచివాలయ ఉద్యోగులు, కూటమి నేతలు, వైద్య సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.


