SPS నెల్లూరు జిల్లా
క్రమశిక్షణే పోలీస్ జీవితానికి పునాది, శిక్షణ కాలమే భవిష్యత్ సేవలకు ఆధారం-జిల్లా యస్.పి. డా. అజిత వేజెండ్ల,ఐపియస్., గారు
• విశాఖపట్నం సిటీ నుండి వచ్చిన 108 మంది, తిరుపతి సిటీ నుండి వచ్చిన 68 మంది, మొత్తం 176 మంది SCPTC లకు 9 నెలల శిక్షణ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి, అనంతరం ఆధునికీకరించిన ఆఫీసు రూమ్, బ్యారక్స్, ఇతర గదులను ప్రారంభించి, ట్రైనింగ్ పోలీస్ కానిస్టేబుల్స్ (సివిల్) కు మార్గనిర్ధేశం చేసినన జిల్లా యస్.పి. గారు.
• ఇది మీ జీవితంలో అత్యంత కీలకమైన ఘట్టం. పోలీస్ కానిస్టేబుల్‌గా ఎంపికైనందుకు మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు.
• పోలీస్ యూనిఫారం అందరికీ ఒకేలా ఉంటుంది, అయితే హోదాలు (రాంకులు) భిన్నంగా ఉంటాయి. పోలీస్ చిహ్నం (లోగో) మాత్రం అందరికీ ఒకటే.
• పోలీస్ కానిస్టేబుల్ అనేది ప్రజలకు పోలీస్ శాఖతో మొదటి సంప్రదింపు కేంద్రం. పోలీస్ శాఖ ప్రతిష్ఠ ఎక్కువగా కానిస్టేబుల్ ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది.
• * పోలీస్ కానిస్టేబుల్ విధులు కేవలం నేరాల నిరోధకానికి మాత్రమే పరిమితం కావు; ప్రజల శాంతి భద్రతలు, ప్రజా ప్రశాంతత మరియు శాంతి భద్రతల నిర్వహణ కూడా ముఖ్యమైన బాధ్యతలు.
• భారతీయ న్యాయ సంహిత (BNS), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత,(BNSS), భారతీయ సాక్ష్య అధినియమం (BSA) మరియు ప్రత్యేక స్థానిక చట్టాలు (SLLs) పట్ల స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి.
• కులం, మతం, వర్గం వంటి అన్ని భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరినీ సమానంగా చూడాలి.
• ప్రజల ప్రాణాలు, ఆస్తుల భద్రత – రెండూ పోలీస్ శాఖ యొక్క ముఖ్యమైన బాధ్యతలు.
• మీ వ్యక్తిగత ప్రవర్తన ఎప్పుడూ ప్రజల పరిశీలనలోనే ఉంటుంది. ఒకరి తప్పిదం మొత్తం పోలీస్ శాఖ ప్రతిష్ఠను దెబ్బతీస్తుంది; అదే విధంగా మంచి ప్రవర్తన కూడా శాఖకు మంచి పేరు తీసుకువస్తుంది.
• శిక్షణ పొందుతున్న ట్రెయినీలు క్రమశిక్షణ, నిబద్ధత, నిజాయితీ, ధైర్యం వంటి లక్షణాలను జీవితంలో అలవర్చుకోవాలి.
• ప్రస్తుత సమాజంలో సైబర్ నేరాలు పెద్ద సవాలుగా మారాయని, సాంకేతికతకు అనుగుణంగా శిక్షణ పొందాలని సూచించారు.
• శిక్షణార్థుల కోసం అత్యాధునిక కంప్యూటర్, సైబర్ ల్యాబ్‌లు, మెడికల్ సెంటర్‌తో పాటు మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
• ట్రైనీ కానిస్టేబుళ్ల సమస్యలు, సూచనల కోసం ‘సజెషన్ బాక్స్’ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
• శిక్షణలో ఏ అంశం అర్థం కాకపోతే అధికారులను అడిగి తెలుసుకోవాలని, ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
• కుటుంబ సహకారం, ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
• అదనపు ఎస్పీ అడ్మిన్ (ట్రైనింగ్ సెంటర్ ప్రిన్సిపాల్) శ్రీమతి CH.సౌజన్య గారు మాట్లాడుతూ, శిక్షణలో శారీరక దృఢత్వం, మానసిక స్థైర్యం, వృత్తి నైపుణ్యాల అభివృద్ధి అత్యంత అవసరం.
• ఈ కార్యక్రమంలో జిల్లా యస్.పి. గారితో పాటు అడిషనల్ యస్.పి.(అడ్మిన్) శ్రీమతి CH. సౌజన్య గారు, DPTC DSP శ్రీ గిరిధర్, SB DSP శ్రీ శ్రీనివాసరావు, ఆత్మకూరు DSP శ్రీ వేణుగోపాల్, AR DSP శ్రీ చంద్రమోహన్, HG DSP శ్రీ NV రమణ, AO శ్రీ చంద్రమౌళి గార్లు, సంబంధిత పోలీస్ అధికారులు, ట్రైనింగ్ సిబ్బంది, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా పోలీసు కార్యాలయం, తేది.22.12.2025.


