క్యూబా కాలేజీలో జాబ్ మేళా
– – – 60 మంది ఎంపిక
వెంకటాచలం, మార్చి 18 (పున్నమి విలేఖరి):
వెంకటాచలంలోని క్యూబా ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం ఉద్యోగ మేళా నిర్వహించినట్లు ఆ కళాశాల అకాడమీక్ డైరెక్టర్ డాక్టర్ హయ్యత్ రజ్వి తెలిపారు. తడ శ్రీ సిటీ ఆధ్వర్యంలో, క్యూబా ఇంజనీరింగ్ కళాశాల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు. తడలోని శ్రీసిటీకి చెందిన 3 కంపెనీలు ఉద్యోగ మేళాకు హాజరయ్యాయని, ఉద్యోగ మేళాకు 226 మంది అభ్యర్థులు విచ్చేశారన్నారు. ఇందులో 60 మంది ఎంపికైనట్లు పేర్కొన్నారు. ఉద్యోగ మేళాలో ఎంపికైన అభ్యర్థులందరూ వారు ఎంపికైన కంపెనీల్లో రేపటి నుంచే విధులకు హాజరు కావచ్చు అని అన్నారు. కార్యక్రమంలో తడ శ్రీ సిటీ హెచ్ఆర్ షేక్ హిమాయత్ బాషా, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సాజిద్, కళాశాల ప్లేస్మెంట్ అధికారి పి.బాబు, కంపెనీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.