చేజర్ల ఆగస్టు (పున్నమి ప్రతినిధి)
మండలంలోని కౌలు రైతులు తప్పనిసరిగా సిసిఆర్సి కార్డ్స్ పొందాలని మండల వ్యవసాయ అధికారి బి . జ్యోత్స్న తెలిపారు. మండలంలోని చేజర్ల, మడపల్లి గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వేసిన పంట పరిశీలించి అనంతరం రైతులతో మాట్లాడుతూ భూమి లేని కౌలు రైతులు సిసిఎస్ కార్డు పొందడం వలన ప్రభుత్వ పథకాలు రాయితీని పొందవచ్చు అని తెలిపారు. అందువలన కౌలు రైతులు తప్పనిసరిగా సిసిఆర్ కార్డు పొందాలని ఆమె సూచించారు. కార్డు పొందుటకు స్థానిక వీఆర్వో ను సంప్రదించి రైతు ఆధార్ కార్డు పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, కౌలు రాసుకున్న పత్రంతో విఆర్ఓ లాగిన్ ద్వారా పొందవచ్చునని ఆమె తెలిపారు. కనుక రైతులందరూ తప్పనిసరిగా పంట నమోదు చేయించుకోవాల్సిందిగా సూచించారు. ఈ కార్యక్రమంలో ఎఈఓ సుజాత, విఎఎలు మేఘన, చెంచయ్య మరియు రైతులు పాల్గొన్నారు.


