శ్రీకాళహస్తి పిబ్రవరి 05, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి పట్టణంలోని కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్‌ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లాలనే లక్ష్యంతో టౌన్ బ్యాంక్ చైర్మన్ ఎస్. ఖాదర్ బాష ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సూచనలతో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో బ్యాంక్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన “7 కిలోవాట్ల రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్ తో పాటు బ్యాంకులో ఆధునిక సదుపాయాలతో కూడిన లాకర్లను ఏర్పాటు చేసి వీటిని ఎమ్మెల్యే చేతులమీదుగా ప్రారంభించాలని ఎమ్మెల్యేని కోరడంతో ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి,తిరుపతి జిల్లా పార్లమెంట్ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి, పాల్గొని కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా టౌన్ బ్యాంక్ చైర్మన్ ఎస్.ఖాదర్ భాష మాట్లాడుతూ,శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి నాయకత్వంలో శ్రీకాళహస్తి నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న విధంగా కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్‌ను కూడా అదే అభివృద్ధి బాటలో నడిపిస్తానని బ్యాంక్‌కు త్వరలోనే ఏటీఎం. (ATM)ప్రారంభోత్సవం నిర్వహిస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. బ్యాంక్ ఆధునీకరణ చర్యలు పట్టణ ప్రజలకు మరింత మెరుగైన బ్యాంకింగ్ సేవలు అందించడంలో కీలకంగా నిలవనున్నాయని పలువురు అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కోలా ఆనంద్, బ్యాంకు సీఈవో ధనంజనేయులు,మరియు కూటమి నాయకులు , బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ఆధునిక లాకర్లను ప్రారంభించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి