Sunday, 22 March 2026
  • Home  
  • కోవిడ్-19 టీకా పనితనం పై బహు పరిశోధనలు
- విశాఖపట్నం

కోవిడ్-19 టీకా పనితనం పై బహు పరిశోధనలు

*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:- *ఆంధ్రవిశ్వవిద్యాలయం లో పి.జి చదువుతున్న ఒక విద్యార్థుల బృందం గత రెండున్నర సంవత్సరాలుగా కోవిడ్-19 టీకా పనితనం పై బహు పరిశోధనలు చేసి, ఇటీవలే కరోనా వైరస్ కోవిడ్-19 టీకా నుండి తప్పించుకొనే ఒక నూతన విధానాన్ని కనుగొన్నారు. టీక్యాబ్స్- ఇ ప్రయోగశాల వ్యవస్థాపకులు ప్రొఫెసర్ రవికిరణ్ యేడిది ఈ విద్యార్థుల బృందాన్నికి మార్గదర్శకత్వం వహించారు.* ఈ నూతన ఆవిష్కరణలను గురించి మాట్లాడుతూ కరోనా వైరస్ స్పైక్ ప్రోటీన్ లో కొన్ని భాగాలు అస్థిరత్వం కలిగి ఉండడం వలన అవి ఘనపదార్ధాలుగా కాకుండా క్షణిక కాలం పాటు ద్రవ స్థితిలోకి పరివర్తనం చెందుతాయని అందువలన మనం తీసుకున్న కోవిడ్-19 టీకా ప్రభావం తో శరీరం లో ఉత్ప్పతైనా ప్రతిరోధకాలు అయోమయ పరిస్థితిలో వైరస్ ను నిరోధించే సామర్ధ్యాన్ని కోల్పోతాయి అని ప్రొఫెసర్ రవికిరణ్ యేడిది చెప్పారు. తన బృందం లోని విద్యార్థులందరూ అహర్నిశలు కష్టపడి ఈ విజయాన్ని సాధించారని ప్రొఫెసర్ రవికిరణ్ గర్వం గా చెప్పారు. ముఖ్యంగా మణికంఠ సోడసాని(M.Pharm), అభినవ్ గ్రంధి (Pharm.D), నిహారిఖ మూకల(M.Sc), జాహ్నవి చింతలపాటి (M.SC), మాధురి విస్సాప్రగడ (M.Sc), వరుసగా బయోఫిసిక్స్, కంప్యూటర్ సీములేషన్స్, మోలెక్యూలర్ బయాలజీ, బయోకెమిస్ట్రీ మరియు జీన్ క్లోనింగ్ ప్రయోగాలు చెయ్యగా మధుమిత అగ్గున్న (M.S) పలు సాఫ్ట్వేర్ పద్ధతులను ఈ ప్రయోగాలు తో జోడించడం జరిగింది. ఈ తరహా బహుళ విభాగ సమ్మేళన పరిశోధనల వలన ఇటువంటి ఫలితాలను సాధించటమేకాక ఇటీవల ప్రతిష్టాత్మక ఎల్సేవియర్ అంతర్జాతీయ శాస్త్రీయ పత్రిక BBA లో ప్రచురించటం జరిగింది. భవిష్యతులో కోవిడ్-19 టీకా సమర్ధతను పెంచడానికి కృత్రిమమేధా మరియు క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి సాంకేతిక రంగాలను బయోటెక్నాలజీతో కలిపితే కానీ సాధ్యం కాకపోవచ్చునని ప్రొఫెసర్ రవికిరణ్ యేడిది అన్నారు. *ఈ నూతన ఆవిష్కరణను సాధించినందుకు ప్రొఫెసర్ రవికిరణ్ ను మరియు ఆయన విద్యార్థి బృందాన్ని ఆంధ్రవిశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ జి.పి. రాజశేఖర్ అభినందించారు.*

*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:-
*ఆంధ్రవిశ్వవిద్యాలయం లో పి.జి చదువుతున్న ఒక విద్యార్థుల బృందం గత రెండున్నర సంవత్సరాలుగా కోవిడ్-19 టీకా పనితనం పై బహు పరిశోధనలు చేసి, ఇటీవలే కరోనా వైరస్ కోవిడ్-19 టీకా నుండి తప్పించుకొనే ఒక నూతన విధానాన్ని కనుగొన్నారు. టీక్యాబ్స్- ఇ ప్రయోగశాల వ్యవస్థాపకులు ప్రొఫెసర్ రవికిరణ్ యేడిది ఈ విద్యార్థుల బృందాన్నికి మార్గదర్శకత్వం వహించారు.* ఈ నూతన ఆవిష్కరణలను గురించి మాట్లాడుతూ కరోనా వైరస్ స్పైక్ ప్రోటీన్ లో కొన్ని భాగాలు అస్థిరత్వం కలిగి ఉండడం వలన అవి ఘనపదార్ధాలుగా కాకుండా క్షణిక కాలం పాటు ద్రవ స్థితిలోకి పరివర్తనం చెందుతాయని అందువలన మనం తీసుకున్న కోవిడ్-19 టీకా ప్రభావం తో శరీరం లో ఉత్ప్పతైనా ప్రతిరోధకాలు అయోమయ పరిస్థితిలో వైరస్ ను నిరోధించే సామర్ధ్యాన్ని కోల్పోతాయి అని ప్రొఫెసర్ రవికిరణ్ యేడిది చెప్పారు.

తన బృందం లోని విద్యార్థులందరూ అహర్నిశలు కష్టపడి ఈ విజయాన్ని సాధించారని ప్రొఫెసర్ రవికిరణ్ గర్వం గా చెప్పారు. ముఖ్యంగా మణికంఠ సోడసాని(M.Pharm), అభినవ్ గ్రంధి (Pharm.D), నిహారిఖ మూకల(M.Sc), జాహ్నవి చింతలపాటి (M.SC), మాధురి విస్సాప్రగడ (M.Sc), వరుసగా బయోఫిసిక్స్, కంప్యూటర్ సీములేషన్స్, మోలెక్యూలర్ బయాలజీ, బయోకెమిస్ట్రీ మరియు జీన్ క్లోనింగ్ ప్రయోగాలు చెయ్యగా మధుమిత అగ్గున్న (M.S) పలు సాఫ్ట్వేర్ పద్ధతులను ఈ ప్రయోగాలు తో జోడించడం జరిగింది. ఈ తరహా బహుళ విభాగ సమ్మేళన పరిశోధనల వలన ఇటువంటి ఫలితాలను సాధించటమేకాక ఇటీవల ప్రతిష్టాత్మక ఎల్సేవియర్ అంతర్జాతీయ శాస్త్రీయ పత్రిక BBA లో ప్రచురించటం జరిగింది. భవిష్యతులో కోవిడ్-19 టీకా సమర్ధతను పెంచడానికి కృత్రిమమేధా మరియు క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి సాంకేతిక రంగాలను బయోటెక్నాలజీతో కలిపితే కానీ సాధ్యం కాకపోవచ్చునని ప్రొఫెసర్ రవికిరణ్ యేడిది అన్నారు. *ఈ నూతన ఆవిష్కరణను సాధించినందుకు ప్రొఫెసర్ రవికిరణ్ ను మరియు ఆయన విద్యార్థి బృందాన్ని ఆంధ్రవిశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ జి.పి. రాజశేఖర్ అభినందించారు.*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.