* క్రీడలో మానసిక శారీరక దృఢత్వానికి సోపానాలు
* తిరుచానూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ మౌనిక మునిశేఖర్
తిరుపతి, మార్చి 30 పున్నమి ప్రతినిధి
క్రీడలు మానసిక శారీరక దృఢత్వానికి సోపానాలని తిరుచానూరు మార్కెట్ యార్డ్ పాలమండలి చైర్మన్ ఊరుబిండి మౌనిక మునిశేఖర్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సభ్యులు చెరుకూరి వెంకటేశ్వర ప్రసాద్,హెచ్ ఎన్ ఆర్ ప్రాజెక్టు ప్రోపరేటర్ కామసాని నరసింహారెడ్డిలు పేర్కొన్నారు. క్రీడాభారతి, హెచ్ఎన్ఆర్ ప్రాజెక్టు సంయుక్త ఆధ్వర్యంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా కబడ్డీ పోటీలను నిర్వహించారు.
చిత్తూరు ఉమ్మడి జిల్లా పరిధిలోని వివిధ మండలాల నుంచి అండర్ 14, అండర్ 19 బాలుర,బాలికల జట్లకు కబడ్డీ పోటీలు నిర్వహించారు.70 జట్లు పోటీపడ్డాయి.సోమవారం విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా విచ్చేసిన వారు మాట్లాడుతూ అంతరించిపోతున్న ప్రాచీన క్రీడలను ప్రోత్సహించడానికి క్రీడా భారతి ఎంతగానో కృషి చేస్తుందని తెలిపారు. నెట్ సెల్ ఫోన్ ప్రపంచంలో క్రీడాలను యువత విద్యార్థులు పూర్తిగా మర్చిపోతున్నారన్నారు. క్రీడలతో మానసిక ఉల్లాసం శారీరక దృఢత్వం ఏర్పడుతుందని తెలిపారు. క్రీడలతో నాయకత్వ లక్షణాలు, క్రీడా స్ఫూర్తి ఏర్పడుతుందని తెలిపారు. కబడ్డీ వంటి భారతీయ ప్రాచీన క్రీడలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.క్రీడాభారతి దక్షిణ మధ్య క్షేత్ర సంయోజక్ చంద్రశేఖర్ జాగీర్, అఖిల భారత క్రీడా భారతి కేంద్ర ప్రముఖ్ అశోక్,జిల్లా క్రీడా భారతి అధ్యక్షులు, ధనజయ రెడ్డిలు మాట్లాడుతూ భారతీయ ప్రాచీన క్రీడలను కాపాడుకునేందుకు నేటి యువతలో స్ఫూర్తిని నింపేందుకు దేశవ్యాప్తంగా కబడ్డీ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2039 ఒలంపిక్ లో కబడ్డీ పోటీలను ప్రవేశపెట్టాలన్నదే క్రీడభారతి లక్ష్యం అని తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 3000 కేంద్రాలలో కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
.
కబడ్డీ పోటీలో విజేతలు వీరే..
అండర్ 14 విభాగంలో ఏడు బాలికల జట్లు, 17 బాలుర జట్లు పోటీపడ్డాయి. అండర్ 19 విభాగంలో 9 బాలికల జట్లు 21 బాలురు జట్లు పోటీపడ్డాయి. అండర్ 14 గర్ల్స్ విభాగంలో ఏ ఎస్ ఏ స్పోర్ట్స్ క్లబ్, అనుంపల్లి జడ్.పి.హెచ్,ఎస్, నారాయణ ఓఎంసీఎస్ వాడు వరుస మూడు స్థానాల్లో నిలిచాయి. అండర్ 19 గర్ల్స్ విభాగంలో కె వి ఎస్ -ఎ జట్టు, కెవిఎస్ -b జట్టు, కేశవరెడ్డి జట్లు వరుస మూడు స్థానాల్లో నిలిచాయి. అండర్ 14 బాయ్స్ విభాగంలో వెరిటాస్ సైనిక్ స్కూల్, నిండ్ర ప్రభుత్వ పాఠశాల, ప్రశాంత్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వరుస మూడు స్థానాల్లో నిలిచాయి. అండర్ 19 బాయ్స్ విభాగంలో ఎస్వి డిఫెన్స్ పాఠశాల మొదటి స్థానంలో, బిఆర్ పల్లి ప్రభుత్వ పాఠశాల రెండో స్థానంలో ,ఎస్వి డిఫెన్స్ అకాడమీ నింద్ర ప్రభుత్వ పాఠశాలలు సంయుక్తంగా మూడవ స్థానంలో నిలిచాయి. ఓవరాల్ ఛాంపియన్షిప్ జూనియర్ బాయ్స్ వెరిటేజ్ సైనిక్ స్కూల్ సీనియర్ బాయ్స్ మంత్ర జట్లు నిలిచాయి. గెలుపొందిన విజేతలకు ఛాంపియన్ ట్రోపీలను మెడల్స్ ను ప్రధానం చేశారు. కబడ్డీ పోటీలు నిర్వహణకు కృషిచేసిన రామస్వామి నరసింహారెడ్డిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో క్రీడభారతి రాష్ట్ర కార్యదర్శి బసవరాజు, దక్షిణ భారత క్రీడా భారతి సబ్యులు, సురేంద్ర రెడ్డిమిట్టపల్లి, ఆర్ సి పురం టిడిపి మహిళా అధ్యక్షురాలు గుణసుందరి, గాజుల రవి, కాలనీ సామాజిక సాధికారిక సంక్షేమ కమిటీ సభ్యులు రాజారామ్ ,ఉమేష్ గౌడ్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. కోచ్ లను గ్రామ కమిటీ పెద్దలను ఘనంగా సత్కరించారు.








