కోరం కనకయ్య గారు కొంచం కనికరించండి
పున్నమి ప్రతినిధి – భుక్యా వినోద్ కుమార్
కామేపల్లి, ఇల్లందు
27-10-2025, శనివారం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఇల్లందు నియోజకవర్గం, కామేపల్లి మండలం అడవి మద్దుల పల్లి నుండి ముచర్ల వరకు ఉన్న రోడ్డు అడుగు లోతుతో, పగిలిన రోడ్డు అంచులు, నీటి నిల్వలతో ప్రమాదకరంగా మారింది. ఒక రోజులో పదుల సంఖ్యలో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. దశాబ్ద కాలంగా మరమ్మత్తులకు కూడా నోచుకోని రోడ్డు. పట్టపగలే ప్రయాణాలు చేయడానికి భయపడే పరిస్థితి, ఇంకా రాత్రిళ్ళు ప్రయాణం చేయాలి అంటే వేరే చెప్పనక్కర్లేదు. వర్షాకాలంలో అడుగు లోతు గుంతలతో నీరు నిల్వ ఉండి ప్రయాణికులకు కనపడక ఎన్నో ప్రమాదాలు జరిగాయి. దశాబ్ద కాలం నుండి ఒక్క అధికారి, కానీ ప్రజా ప్రతినిధులు కానీ ఆ రోడ్డు వైపు కన్నెత్తి చూసిందే లేదు. ఇంకెంత కాలం ఈ అవస్థలు, ఇంకెంత కాలం ఈ ప్రమాదాలు. కామేపల్లి మండల పరిధిలోని ఈ రోడ్డును స్థానిక శాసనసభ్యులుగా ఉన్న మీరు అయినా కొంచం కనికరించి ఈ రోడ్డు నిర్మాణం చేపట్టాలని స్థానిక ప్రజలు, వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


