కోస్తా ఆంధ్రలో మొంథా తుపాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ముఖ్యంగా డా. బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది బీచ్ పరిసరాల్లో సముద్రం ఉద్ధృతంగా మారింది. గాలివానలు, భారీ అలలు తీరాన్ని ఢీకొడుతున్నాయి. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తీరప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా యంత్రాంగం సూచించింది. తుఫాన్ ప్రభావంతో వర్షాలు, బలమైన గాలులు కొనసాగుతున్నాయి.

కోనసీమ జిల్లా అంతర్వేది బీచ్ వద్ద మొంథా తుపాన్ ప్రభావం