రైల్వే కోడూరు నియోజకవర్గం:–
ఓబులువారిపల్లి మండలం చెన్న రాజుపాడు గ్రామానికి చెంది మహ్మద్ మరియు రెడ్డి భాష గారి ఆహ్వానంతో రైల్వే కోడూరు మండలం వై కోట క్రాస్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన మూన్ బేకరి ప్రారంభ కార్యక్రమం ఈ రోజు జరిగింది.
ఈ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా *రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు KUDA చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి , ప్రభుత్వ విప్ మరియు రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ హాజరై రిబ్బన్ కటింగ్ చేసి షాప్ ను ప్రారంభించారు.*
ఈ సందర్భంగా ముక్కా రూపానంద రెడ్డి మాట్లాడుతూ – “ప్రతి గ్రామంలో చిన్న పరిశ్రమలు, వ్యాపారాల అభివృద్ధి కోసం మనం కలిసి ముందుకు సాగాలి. ఈ నూతన షాప్ గ్రామ ప్రజలకు ఉపయుక్తంగా ఉంటుందని విశ్వసిస్తున్నాను” అని అన్నారు.i
అరవ శ్రీధర్ మాట్లాడుతూ – “స్థానిక యువత స్వయం ఉపాధి వైపు అడుగులు వేయడం సంతోషకరం. ఈ షాప్ ఆదర్శంగా నిలిచేలా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం” అని చెప్పారు.


