విశాఖ, గాజువాక, అక్టోబర్ (పున్నమి ప్రతినిధి)
తెలుగు దేశం పార్టీ మంత్రి కొల్లు రవీంద్ర గాజువాక టిడిపి కార్యాలయంలో జరిగిన పత్రికాసమావేశంలో మాట్లాడుతూ —
“చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న నాయకుడు. రాష్ట్ర అభివృద్ధి, యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడం ఆయన ప్రధాన లక్ష్యం” అని పేర్కొన్నారు.
“కూటమి ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా ముందుకు వెళుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రతి రంగంలోనూ పునర్నిర్మాణం జరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాత్ర చాలా గొప్పది, ఆయన గ్రామీణ స్థాయిలో అభివృద్ధి మార్గాన్ని చూపిస్తున్నారు” అని ఆయన వివరించారు.
అలాగే మాజీ వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ —
“గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం కోడి గుడ్డూ పెట్టలేదు… పొదగ లేదు… రాష్ట్రాన్ని అప్పుల బారిన పడేసి ప్రజలను దారిద్య్రంలోకి నెట్టింది” అని తీవ్రస్థాయిలో విమర్శించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ మళ్లీ సుస్థిరాభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.


