కోట పంచాయతీలో రేషన్ సరకుల పంపిణీ ప్రారంభం
ప్రజలకు ఇబ్బంది లేకుండా సమర్థవంతమైన పంపిణీకి చర్యలు – టీడీపీ నాయకులు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, వినోద్ కుమార్ రెడ్డి
కోట, పున్నమి న్యూస్ – కన్నారి సూరిబాబు
కోట మండలంలోని కోట పంచాయతీ పరిధిలో రేషన్ సరకుల పంపిణీ కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. కోట పంచాయతీలోని ఆంజనేయ స్వామి దేవాలయం ఎదుట ఉన్న మెయిన్ రేషన్ దుకాణంలో, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన టీడీపీ సీనియర్ నాయకులు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి మరియు నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి రేషన్ పంపిణీని ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, పారదర్శకంగా రేషన్ పంపిణీ జరగాలి అని అన్నారు. రోజుకు 8 గంటల పాటు, 15 రోజులపాటు రేషన్ దుకాణాలు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేయడం ప్రజలకు మేలు చేకూరుస్తుందని అన్నారు.
ప్రజల అవసరాలను గుర్తించి, సకాలంలో సరుకులను అందించడం ప్రభుత్వ బాధ్యతగా పేర్కొన్నారు. కార్యక్రమంలో వాలంటీర్లు, గ్రామస్థాయి నాయకులు, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.