ఖానాపురం పున్నమి ప్రతినిధి.నర్సంపేట పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమ నేత స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మూడో నెల సందర్భంగా పూర్వ తెలంగాణ ఉద్యమకారులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి, ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఉద్యమకారులు మాట్లాడుతూ.. 2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి గారు పోషించిన పాత్ర చిరస్మరణీయమని, నర్సంపేటను ఉద్యమాల గడ్డగా నిలిపిన గొప్ప నాయకుడని కొనియాడారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధన కోసం ఆయన చేసిన పోరాటాలు, టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి అందించిన సేవలు మరువలేనివని పేర్కొన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారం, పేదల సంక్షేమం, నర్సంపేట అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మరణం తెలంగాణ ఉద్యమానికి తీరని లోటని అన్నారు.
కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు నాయకత్వంలో నర్సంపేట నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధ చూపి, తమ ఉద్యమ నేత లేని లోటును తీర్చాలని కోరారు.
ఈ కార్యక్రమంలో నర్సంపేట నియోజకవర్గ పూర్వ తెలంగాణ ఉద్యమకారులు పాల్గొన్నారు.
