పున్నమి న్యూస్ ప్రతినిధి కొవ్వూరు(సెప్టెంబర్ 16)
తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు గవర్నమెంట్ హైస్కూల్ నందు సహిత విద్య విభాగం కార్యక్రమంలో భాగంగా మెడికల్ అసెస్మెంట్ క్యాంపు లో పాల్గొన్న కొవ్వూరు నియోజకవర్గం శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు
కొవ్వూరు మండలంలో గల అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న మరియు ఇంటి వద్దనే ఉంటున్నా విద్యార్థులకు సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో, ఆలింకో సంస్థ ద్వారా అర్హులైన పిల్లలకు ఉచితంగా ఇవ్వడానికి, ఉపకరణల నిద్దారణ క్యాంపు నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా వారికి ఉపకరణాలు 1. వీల్ చైర్లు, 2. రోలెటర్లు, 3. వినికిడి యంత్రాలు, 4. మూడు చక్రాల కుర్చీలు, 5. సి.పి చైర్లు, 6. యం.ఆర్ కిట్లు, 7. చంక కర్రలు, 8. బ్రెయిలి కీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం లో సమగ్ర శిక్షణాఏ. ఎం.సి, మున్సిపల్ చైర్ పర్సన్ , ఏ. యం.సి చైర్మన్ ,కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


