తూర్పుగోదావరి జిల్లా
పున్నమి ప్రతినిధి
✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం
సీనియర్ రిపోర్టర్
9989086083.
తూర్పుగోదావరి కొవ్వూరు
కొవ్వూరు డిగ్రీ కళాశాల నిర్మాణానికి నిధులు కేటాయించి ఇచ్చిన స్థలంలో నిర్మాణం తక్షణమే చేపట్టాలని ఎస్.ఎఫ్.ఐ ఆధ్వర్యంలో ఆర్డీవో ఆఫీస్ లో ఏ.ఓకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు కార్యదర్శులు వై.భాస్కర్, ఎస్.రాజు మాట్లాడుతూ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్.ఎఫ్.ఐ ఆధ్వర్యంలో విద్యార్థులతో ర్యాలీగ ఆర్ డి ఓ ఆఫీస్ కు వెళ్లి వినతిపత్రం అందజేశారని అన్నారు 2019లో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేశారన్నారు
చుట్టుపక్కల 30 కిలోమీటర్లలొని గ్రామాల విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా డిగ్రీ కళాశాల నడుస్తుంది అన్నారు. ఇక్కడే ఇంటర్, స్కూల్ ఉండటంతో ఒక పూట మాత్రమే కళాశాల జరుగుతోందన్నా అన్నారు. తరగతి గదులు లేక విద్యార్థులకు ఇబ్బంది అవుతోందని అయితే ఈ డిగ్రీ కళాశాల అభివృద్ధి కోసం 2021లో 4.8 స్థలం కేటాయించారు. అప్పటినుంచి ఇప్పటివరకు కూడా డిగ్రీ కళాశాల భవన నిర్మాణానికి నిధులు కేటాయించలేదని దీంతో కళాశాల నిర్మాణం జరగట్లేదు అని తక్షణమే డిగ్రీ కళాశాల నిర్మాణానికి నిధులు కేటాయించి ఇచ్చిన స్థలంలో నిర్మాణం చేపట్టాలని అన్నారు ఈ కార్యక్రమంలో కార్తీక్, లోహిత్, మహేష్ విద్యార్థులు పాల్గొన్నారు
END


