తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యక్తిగత వివాదా లను సమర్థించుకోవడానికి నందిగామ నియోజకవర్గం, ప్రజాప్రతినిధులను అనవసరం గా వివాదాల్లోకి లాగడాన్ని తీవ్రంగా ఖండిస్తూ నందిగామ ఎమ్మెల్యే & ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య ప్రకటన విడుదల చేశారు.
తన ఒంటికి అంటిన బురదను ఇతరులకు రుద్దాలని చూడటం రాజకీయ అపరిపక్వతకు పరాకాష్ట అని వ్యాఖ్యానించిన ఆమె, పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే బహిరంగ ఆరోపణలు చేయకుం డా సమస్యలను అధిష్టానం వద్ద పరిష్కరించుకోవాలని సూచించారు. విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ (చిన్ని) తో ఎలాంటి విభేదాలు లేవని, నందిగామ అభివృద్ధికి ఆయన చేసిన కృషి అమూల్యమని పేర్కొన్నారు. వంద పడకల ఆసుపత్రి, కేంద్రీయ విద్యాలయం, ఆయుష్ హాస్పిటల్, రైల్వే అభివృద్ధి వంటిపలు ప్రాజెక్టులు ఎంపీ చిన్ని సహకారంతో సాధ్యమ య్యాయని తెలిపారు.
మున్సిపల్ చైర్‌పర్సన్ఎన్నికలు, ఇసుక అంశాలపై కొలికపూడి చేసిన వ్యాఖ్యలునిరాధారమని, పార్టీ మార్గదర్శకాల ప్రకారం ఎంపీతో సంపూర్ణ ఏకాభిప్రాయం తో నిర్ణయాలు తీసుకున్నామని స్పష్టం చేశారు. వ్యక్తిగత వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడా నికి ఇతరులను వివాదాల్లోకి లాగడాన్ని వెంటనే నిలిపివేయా లని ఆమె హెచ్చరించారు.

కొలికపూడి అసత్య ఆరోపణ లను ఖండించిన నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య — ఎంపీ కేసినేని చిన్నితో విభేదాలు లేవు
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యక్తిగత వివాదా లను సమర్థించుకోవడానికి నందిగామ నియోజకవర్గం, ప్రజాప్రతినిధులను అనవసరం గా వివాదాల్లోకి లాగడాన్ని తీవ్రంగా ఖండిస్తూ నందిగామ ఎమ్మెల్యే & ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య ప్రకటన విడుదల చేశారు. తన ఒంటికి అంటిన బురదను ఇతరులకు రుద్దాలని చూడటం రాజకీయ అపరిపక్వతకు పరాకాష్ట అని వ్యాఖ్యానించిన ఆమె, పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే బహిరంగ ఆరోపణలు చేయకుం డా సమస్యలను అధిష్టానం వద్ద పరిష్కరించుకోవాలని సూచించారు. విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ (చిన్ని) తో ఎలాంటి విభేదాలు లేవని, నందిగామ అభివృద్ధికి ఆయన చేసిన కృషి అమూల్యమని పేర్కొన్నారు. వంద పడకల ఆసుపత్రి, కేంద్రీయ విద్యాలయం, ఆయుష్ హాస్పిటల్, రైల్వే అభివృద్ధి వంటిపలు ప్రాజెక్టులు ఎంపీ చిన్ని సహకారంతో సాధ్యమ య్యాయని తెలిపారు. మున్సిపల్ చైర్‌పర్సన్ఎన్నికలు, ఇసుక అంశాలపై కొలికపూడి చేసిన వ్యాఖ్యలునిరాధారమని, పార్టీ మార్గదర్శకాల ప్రకారం ఎంపీతో సంపూర్ణ ఏకాభిప్రాయం తో నిర్ణయాలు తీసుకున్నామని స్పష్టం చేశారు. వ్యక్తిగత వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడా నికి ఇతరులను వివాదాల్లోకి లాగడాన్ని వెంటనే నిలిపివేయా లని ఆమె హెచ్చరించారు.

