Wednesday, 30 July 2025
  • Home  
  • కొత్త సీసా పాత సారా వల్ల మంత్రులు పని చేయలేక పోతున్నార?????
- Featured - ఆంధ్రప్రదేశ్

కొత్త సీసా పాత సారా వల్ల మంత్రులు పని చేయలేక పోతున్నార?????

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది అవుతున్నా…కొంత మంది మంత్రులు ఇంకా తమశాఖలపై పట్టుసాధించలేకపోతు న్నారు. ముఖ్యంగా నూతనంగా ఎమ్మెల్యేలు అయి తొలిసారి మంత్రివర్గంలోకి వచ్చిన పలువురు మంత్రులు విఫలం అవుతున్నారన్న భావన అటుపార్టీలోనూ, ఇటు ప్రజల్లోనూ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ‘చంద్రబాబు’ మంత్రివర్గంలో 24మంది మంత్రులు ఉంటే..వీరిలో నలుగురైదు గురు తప్ప మిగతా వారంతా…విజయవంతం కాలేకపోతున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటు పాలనాపరంగా..అటు రాజకీయం గా కూడా వీరు తీవ్రంగా నిరుత్సాహానికి గురిచేస్తున్నాయనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. ఐదుగురు ఓకే…! ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో విద్యాశాఖ మంత్రి ‘నారా లోకేష్‌’ ‘నాదెండ్ల మనోహర్‌’, ‘నిమ్మలరామానాయుడు’, ‘సత్యకుమార్‌యాదవ్‌’ కొంత వరకూ ఉపముఖ్యమంత్రి ‘పవన్‌కళ్యాణ్‌’లు మాత్రమే తమ తమ శాఖలపైపట్టు సాధించగలిగారు. ‘విద్యాశాఖ మంత్రి’ ‘నారా లోకేష్‌’ దూసుకుపోతు న్నారు. తన శాఖలో విప్లవాత్మకమైన సంస్కరణలను ఆయన చేస్తున్నారు. విద్యాశాఖపై ఆయన బాగానే పట్టుసాధించగలిగారు. ఎంతో కష్టమైన ‘విద్యాశాఖ’ను ఆయన తనదైన శైలిలో నిర్వహిస్తున్నారు. ఏదైనా సమస్యలు వచ్చినా..ఆయన వాటికి వెంటనే పరిష్కారాలు చూపిస్తున్నారు. అటు ఉపాధ్యాయులను, ఇటు విద్యార్థులను, నిరుద్యోగులను ఆయన సమన్వయం చేసుకుంటూ వెళుతున్నారు. అయితే..కూటమి ప్రభుత్వ హామీ అయిన ‘మెగా డీఎస్సీ’ వెంటనే అమలు చేయకపోవడం, విద్యార్థులకు ఇస్తానన్న రూ.15వేలు వెంటనే వేయకపోవడం ఆయనకు మైనస్‌గా చెప్పవచ్చు. కాగా..‘లోకేష్‌’ కార్యాలయ సిబ్బంది విషయంలోనే చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాము ‘లోకేష్‌’ వద్ద పనిచేస్తున్నామన్న గర్వంతో..వారి వద్దకు వచ్చేవారిని చులకనగా చూస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. సమస్యలపై వచ్చేవారిని కలవకుండా…తమకు ఇష్టం వచ్చిన వారినే కలుస్తున్నారని, మంత్రి కార్యాలయ అధికారుల వ్యవహారం బాగాలేదనే విమర్శలు ఉన్నాయి. కాగా జలవనరులశాఖ మంత్రి ‘నిమ్మల రామానాయుడు’ తనపని తాను చేసుకుంటూపోతున్నారు. ఆయన పనితీరును వంకపెట్టడానికేమీ లేదు. అయితే..ఆయనకూ, ఆ శాఖ కార్యదర్శికి మధ్య విభేదాలు ఉన్నాయని, వారిద్దరికి పొసగడం లేదని ప్రచారం జరుగుతోంది. మంత్రిని ఆశాఖ కార్యదర్శి అసలు పట్టించుకోవడం లేదని, లెక్కచేయడం లేదని, ఆయనను మార్చాలని కోరినా ముఖ్యమంత్రి ‘చంద్రబాబు’ అలానే కొనసాగిస్తున్నారని ఇది మంత్రికి ఇబ్బంది అవుతోందనే ప్రచారం ఉంది. వైద్యశాఖ మంత్రి ‘సత్యకుమార్‌ యాదవ్‌’ కూడా తనశాఖపై పట్టుసాధించారు. ఆయన చురుగ్గా పనిచేస్తున్నారనే అభిప్రాయాలు ఉన్నాయి. తాను చేయాలనుకునే పనులను నేరుగా చేసుకుంటూ వెళుతున్నారని, ఎవరి ఆదేశాల కోసం ఆయన చూడడం లేదని, అధికారులతో సమన్వయం చేసుకుంటూ వెళుతున్నారంటున్నారు. ‘జనసేన’కు చెందిన ‘నాదెండ్ల మనోహర్‌’ కూడా స్థిరంగానే పనిచేస్తున్నారు. రాజకీయంగా, పాలనాపరంగా అనుభవం ఉన్న ఈయన తనశాఖపై బాగానే పట్టుసాధించారు. అయితే..అక్రమబియ్యం విషయంలో హడావుడి చేసి తరువాత..నెమ్మదించారని, దీని వెనుక ఏదో జరిగిందనే ప్రచారం సాగుతోంది. అయితే పాలనాపరంగా మాత్రం ఆయన బాగానే పనిచేస్తున్నారంటున్నారు. కాగా ఉపముఖ్యమంత్రి ‘పనవ్‌కళ్యాణ్‌’ తనశాఖపై పట్టుసాధించడానికి ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే..ఆయన పాలనను సీరియస్‌గా తీసుకోవడం లేదని, ముఖ్యమైన సమావేశాలకు గైర్హాజరు అవుతున్నారని, దీంతో ఆయనకు పాలనపై పెద్దగా ఆసక్తి లేదనే ప్రచారం సాగుతోంది. అయితే..ఆయన కార్యాలయం బాగా పనిచేస్తుందని, దీనితో..ఆయన వచ్చినా రాకపోయినా..ఆయనశాఖ పనితీరు బాగా ఉంటుందంటున్నారు. కీలక మంత్రులు..వైఫల్యం…! కాగా కొన్ని కీలకమైనశాఖలకు మంత్రులుగా ఉన్నవారు..తమ పనితీరును మెరుగుపర్చుకోలేకపోతు న్నారనే విమర్శలు ఉన్నాయి.ముఖ్యంగా మున్సిపల్‌ మంత్రి ‘నారాయణ’, వ్యవసాయమంత్రి ‘అచ్చెంనాయుడు’, రెవిన్యూ మంత్రి ‘అనగాని సత్యప్రసాద్‌’, ఆర్థికశాఖమంత్రి ‘పయ్యావుల కేశవ్‌’ హోంమంత్రి ‘అనిత’, మైనింగ్‌శాఖ మంత్రి ‘కొల్లు రవీంద్ర’లు అంచనాల మేరకు రాణించలేకపోతున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్న రాజధాని ‘అమరావతి’ విషయంలో ‘మంత్రి నారాయణ’ ఘోరంగా విఫలం అవుతున్నారనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది కావస్తున్నా..రాజధానిలో ఏమీ జరగడం లేదనే భావన ప్రజల్లో ఉంది. రాజధాని ప్రాంతంలో ఈమాటలు బాహాటంగా వ్యక్తం అవుతున్నాయి. ‘ఇక్కడ ఏమీ జరగడం లేదు..కనీసం…కరకట్టను కూడా వీళ్లు ఇంత వరకూ వెడల్పు కూడా చేయలేకపోయారు’..ఇంక రాజధానేమి కడతారు..అనే భావన వీరిలో ఉంది. ఎందుకు ఇంత ఆలస్యం జరుగుతుందో అర్థం కావడం లేదని వారు అంటున్నారు. గతంలో కూడా ఇదే విధంగా ఆలస్యం చేసి..గ్రాఫిక్స్‌ రాజధాని అంటూ ప్రత్యర్థుల ద్వారా ఎద్దేవా చేయించుకున్నారు. చివరకు అది ఎన్నికల్లో పెనుప్రభావాన్ని చూపించింది. ఈసారి కూడా ఇలా కాలాన్ని వృధా చేస్తే..గతంలో వచ్చిన ఫలితాలే వస్తాయి. ‘రెవిన్యూమంత్రి’ ‘అనగాని సత్యప్రసాద్‌’కు కీలకమైనశాఖ దక్కినా..ఆయన ప్రతిదానికి ‘లోకేష్‌’ వైపు చూస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్రంలో గత ప్రభుత్వం సృష్టించిన భూసమస్యలను పరిష్కరించలేక రెవిన్యూశాఖ కిందామీదా పడుతోంది. ఇది రోజు రోజుకు ప్రజల్లో అసంతృప్తిని పెంచుతోంది. మరో మంత్రి ‘పయ్యావుల కేశవ్‌’ పనితీరు కూడా బాగాలేదనే అభిప్రాయాలు ఉన్నాయి. ఆయన తనశాఖలో సగం పెత్తనం ఆయన స్నేహితుడికి అప్పగించారని, దీంతో..ఆయన పెత్తనం శాఖలో పెరిగిపోయిందనే విమర్శలు ఉన్నాయి. సదరు మిత్రుడు అన్నింటిలో వేలు పెడుతున్నాడని, తద్వారా..మంత్రికి చెడ్డపేరు వస్తుందని ఆయన సన్నిహితులే చెబుతున్నారు. ఒకప్పుడు ఫైర్‌బ్రాండ్‌గా పేరున్న ‘కేశవ్‌’ మంత్రి అయిన తరువాత కనీసమాత్రంగానైనా మీడియా సమావేశాలు నిర్వహించడం లేదు. ఎందుకో..ఆయన ఒక కోటరిలో బందీ అయ్యారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక వ్యవసాయశాఖ మంత్రి తన కార్యాలయ అధికారుల అవినీతిని కట్టడి చేయలేకపోతున్నారు. వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా..చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే భావన వ్యక్తం అవుతోంది. హోంమంత్రి ‘అనిత’ ప్రతివిషయానికి ‘లోకేష్‌’పై ఆధారపడుతున్నారనే ప్రచారం సాగుతోంది. మైనింగ్‌,ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తన ప్రత్యర్థి ‘పేర్ని నాని’ని కట్టడి చేయలేకపోతున్నారు. ‘పేర్ని’ అక్రమ బియ్యం విషయంలో అడ్డంగా దొరికినా..‘రవీంద్ర’ ఏమీ చేయలేకపోయారనే భావన పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. కాగా..మిగతా మంత్రుల్లో చాలా మంది తాము మంత్రులమనే విషయాన్నే మరిచిపోయినట్లుంది. అంతే కాకుండా..గత ‘జగన్‌’ ప్రభుత్వంలో పనిచేసిన వారికే వీరు పెద్దపీట వేశారనే విమర్శలను కొనితెచ్చుకుంటున్నారు. వారి కార్యాలయాల్లో పిఆర్వోఓలుగా వారినే కొనసాగిస్తూ..అవినీతి మరకలు అంటించుకుంటున్నారు. పాలనాపరంగా వీరు కీలకంగా పనిచేయడం లేదు. దీంతో వీళ్లు పేరుకు మంత్రులు తప్ప..చేసేదేమీ ఉండదని వారి స్వంత మనుషులే చెప్పుకుంటున్నారు. మొత్తం మీద.. కూటమి మంత్రుల్లో’ పెక్కుమంది తమశాఖలపై పట్టుసాధించలేక విమర్శలు కొనితెచ్చుకుంటున్నారు. త్వరలో ‘నాగబాబు’కు మంత్రి పదవి ఇవ్వడానికి మంత్రివర్గ విస్తరణ చేస్తారని, ఈ సందర్భంగా ఘోరంగా విఫలమైన ముగ్గురు లేక నలుగురిపై వేటు వేస్తారనే ప్రచారం సాగుతోంది. అయితే..ఎవరిపైనా వేటు వేయరని..ఏడాదిన్నర తరువాతే..వీరిపై వేటు ఉంటుందనే ప్రచారం ఉంది. ఈలోగా అయినా..విఫలం అవుతున్న మంత్రులు…తమ పనితీరు మార్చుకోవాలని, అప్పుడే..వారి మంత్రి పదవి పదిలంగా ఉంటుందనే అభిప్రాయాలు ఉన్నాయి.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది అవుతున్నా…కొంత మంది మంత్రులు ఇంకా తమశాఖలపై పట్టుసాధించలేకపోతు న్నారు. ముఖ్యంగా నూతనంగా ఎమ్మెల్యేలు అయి తొలిసారి మంత్రివర్గంలోకి వచ్చిన పలువురు మంత్రులు విఫలం అవుతున్నారన్న భావన అటుపార్టీలోనూ, ఇటు ప్రజల్లోనూ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ‘చంద్రబాబు’ మంత్రివర్గంలో 24మంది మంత్రులు ఉంటే..వీరిలో నలుగురైదు గురు తప్ప మిగతా వారంతా…విజయవంతం కాలేకపోతున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటు పాలనాపరంగా..అటు రాజకీయం గా కూడా వీరు తీవ్రంగా నిరుత్సాహానికి గురిచేస్తున్నాయనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి.

ఐదుగురు ఓకే…!

ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో విద్యాశాఖ మంత్రి ‘నారా లోకేష్‌’ ‘నాదెండ్ల మనోహర్‌’, ‘నిమ్మలరామానాయుడు’, ‘సత్యకుమార్‌యాదవ్‌’ కొంత వరకూ ఉపముఖ్యమంత్రి ‘పవన్‌కళ్యాణ్‌’లు మాత్రమే తమ తమ శాఖలపైపట్టు సాధించగలిగారు. ‘విద్యాశాఖ మంత్రి’ ‘నారా లోకేష్‌’ దూసుకుపోతు న్నారు. తన శాఖలో విప్లవాత్మకమైన సంస్కరణలను ఆయన చేస్తున్నారు. విద్యాశాఖపై ఆయన బాగానే పట్టుసాధించగలిగారు. ఎంతో కష్టమైన ‘విద్యాశాఖ’ను ఆయన తనదైన శైలిలో నిర్వహిస్తున్నారు. ఏదైనా సమస్యలు వచ్చినా..ఆయన వాటికి వెంటనే పరిష్కారాలు చూపిస్తున్నారు. అటు ఉపాధ్యాయులను, ఇటు విద్యార్థులను, నిరుద్యోగులను ఆయన సమన్వయం చేసుకుంటూ వెళుతున్నారు. అయితే..కూటమి ప్రభుత్వ హామీ అయిన ‘మెగా డీఎస్సీ’ వెంటనే అమలు చేయకపోవడం, విద్యార్థులకు ఇస్తానన్న రూ.15వేలు వెంటనే వేయకపోవడం ఆయనకు మైనస్‌గా చెప్పవచ్చు. కాగా..‘లోకేష్‌’ కార్యాలయ సిబ్బంది విషయంలోనే చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాము ‘లోకేష్‌’ వద్ద పనిచేస్తున్నామన్న గర్వంతో..వారి వద్దకు వచ్చేవారిని చులకనగా చూస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. సమస్యలపై వచ్చేవారిని కలవకుండా…తమకు ఇష్టం వచ్చిన వారినే కలుస్తున్నారని, మంత్రి కార్యాలయ అధికారుల వ్యవహారం బాగాలేదనే విమర్శలు ఉన్నాయి.

కాగా జలవనరులశాఖ మంత్రి ‘నిమ్మల రామానాయుడు’ తనపని తాను చేసుకుంటూపోతున్నారు. ఆయన పనితీరును వంకపెట్టడానికేమీ లేదు. అయితే..ఆయనకూ, ఆ శాఖ కార్యదర్శికి మధ్య విభేదాలు ఉన్నాయని, వారిద్దరికి పొసగడం లేదని ప్రచారం జరుగుతోంది. మంత్రిని ఆశాఖ కార్యదర్శి అసలు పట్టించుకోవడం లేదని, లెక్కచేయడం లేదని, ఆయనను మార్చాలని కోరినా ముఖ్యమంత్రి ‘చంద్రబాబు’ అలానే కొనసాగిస్తున్నారని ఇది మంత్రికి ఇబ్బంది అవుతోందనే ప్రచారం ఉంది. వైద్యశాఖ మంత్రి ‘సత్యకుమార్‌ యాదవ్‌’ కూడా తనశాఖపై పట్టుసాధించారు. ఆయన చురుగ్గా పనిచేస్తున్నారనే అభిప్రాయాలు ఉన్నాయి. తాను చేయాలనుకునే పనులను నేరుగా చేసుకుంటూ వెళుతున్నారని, ఎవరి ఆదేశాల కోసం ఆయన చూడడం లేదని, అధికారులతో సమన్వయం చేసుకుంటూ వెళుతున్నారంటున్నారు.

‘జనసేన’కు చెందిన ‘నాదెండ్ల మనోహర్‌’ కూడా స్థిరంగానే పనిచేస్తున్నారు. రాజకీయంగా, పాలనాపరంగా అనుభవం ఉన్న ఈయన తనశాఖపై బాగానే పట్టుసాధించారు. అయితే..అక్రమబియ్యం విషయంలో హడావుడి చేసి తరువాత..నెమ్మదించారని, దీని వెనుక ఏదో జరిగిందనే ప్రచారం సాగుతోంది. అయితే పాలనాపరంగా మాత్రం ఆయన బాగానే పనిచేస్తున్నారంటున్నారు. కాగా ఉపముఖ్యమంత్రి ‘పనవ్‌కళ్యాణ్‌’ తనశాఖపై పట్టుసాధించడానికి ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే..ఆయన పాలనను సీరియస్‌గా తీసుకోవడం లేదని, ముఖ్యమైన సమావేశాలకు గైర్హాజరు అవుతున్నారని, దీంతో ఆయనకు పాలనపై పెద్దగా ఆసక్తి లేదనే ప్రచారం సాగుతోంది. అయితే..ఆయన కార్యాలయం బాగా పనిచేస్తుందని, దీనితో..ఆయన వచ్చినా రాకపోయినా..ఆయనశాఖ పనితీరు బాగా ఉంటుందంటున్నారు.

కీలక మంత్రులు..వైఫల్యం…!

కాగా కొన్ని కీలకమైనశాఖలకు మంత్రులుగా ఉన్నవారు..తమ పనితీరును మెరుగుపర్చుకోలేకపోతు న్నారనే విమర్శలు ఉన్నాయి.ముఖ్యంగా మున్సిపల్‌ మంత్రి ‘నారాయణ’, వ్యవసాయమంత్రి ‘అచ్చెంనాయుడు’, రెవిన్యూ మంత్రి ‘అనగాని సత్యప్రసాద్‌’, ఆర్థికశాఖమంత్రి ‘పయ్యావుల కేశవ్‌’ హోంమంత్రి ‘అనిత’, మైనింగ్‌శాఖ మంత్రి ‘కొల్లు రవీంద్ర’లు అంచనాల మేరకు రాణించలేకపోతున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్న రాజధాని ‘అమరావతి’ విషయంలో ‘మంత్రి నారాయణ’ ఘోరంగా విఫలం అవుతున్నారనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది కావస్తున్నా..రాజధానిలో ఏమీ జరగడం లేదనే భావన ప్రజల్లో ఉంది. రాజధాని ప్రాంతంలో ఈమాటలు బాహాటంగా వ్యక్తం అవుతున్నాయి. ‘ఇక్కడ ఏమీ జరగడం లేదు..కనీసం…కరకట్టను కూడా వీళ్లు ఇంత వరకూ వెడల్పు కూడా చేయలేకపోయారు’..ఇంక రాజధానేమి కడతారు..అనే భావన వీరిలో ఉంది. ఎందుకు ఇంత ఆలస్యం జరుగుతుందో అర్థం కావడం లేదని వారు అంటున్నారు. గతంలో కూడా ఇదే విధంగా ఆలస్యం చేసి..గ్రాఫిక్స్‌ రాజధాని అంటూ ప్రత్యర్థుల ద్వారా ఎద్దేవా చేయించుకున్నారు. చివరకు అది ఎన్నికల్లో పెనుప్రభావాన్ని చూపించింది. ఈసారి కూడా ఇలా కాలాన్ని వృధా చేస్తే..గతంలో వచ్చిన ఫలితాలే వస్తాయి.

‘రెవిన్యూమంత్రి’ ‘అనగాని సత్యప్రసాద్‌’కు కీలకమైనశాఖ దక్కినా..ఆయన ప్రతిదానికి ‘లోకేష్‌’ వైపు చూస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్రంలో గత ప్రభుత్వం సృష్టించిన భూసమస్యలను పరిష్కరించలేక రెవిన్యూశాఖ కిందామీదా పడుతోంది. ఇది రోజు రోజుకు ప్రజల్లో అసంతృప్తిని పెంచుతోంది. మరో మంత్రి ‘పయ్యావుల కేశవ్‌’ పనితీరు కూడా బాగాలేదనే అభిప్రాయాలు ఉన్నాయి. ఆయన తనశాఖలో సగం పెత్తనం ఆయన స్నేహితుడికి అప్పగించారని, దీంతో..ఆయన పెత్తనం శాఖలో పెరిగిపోయిందనే విమర్శలు ఉన్నాయి. సదరు మిత్రుడు అన్నింటిలో వేలు పెడుతున్నాడని, తద్వారా..మంత్రికి చెడ్డపేరు వస్తుందని ఆయన సన్నిహితులే చెబుతున్నారు. ఒకప్పుడు ఫైర్‌బ్రాండ్‌గా పేరున్న ‘కేశవ్‌’ మంత్రి అయిన తరువాత కనీసమాత్రంగానైనా మీడియా సమావేశాలు నిర్వహించడం లేదు. ఎందుకో..ఆయన ఒక కోటరిలో బందీ అయ్యారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక వ్యవసాయశాఖ మంత్రి తన కార్యాలయ అధికారుల అవినీతిని కట్టడి చేయలేకపోతున్నారు. వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా..చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే భావన వ్యక్తం అవుతోంది. హోంమంత్రి ‘అనిత’ ప్రతివిషయానికి ‘లోకేష్‌’పై ఆధారపడుతున్నారనే ప్రచారం సాగుతోంది.

మైనింగ్‌,ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తన ప్రత్యర్థి ‘పేర్ని నాని’ని కట్టడి చేయలేకపోతున్నారు. ‘పేర్ని’ అక్రమ బియ్యం విషయంలో అడ్డంగా దొరికినా..‘రవీంద్ర’ ఏమీ చేయలేకపోయారనే భావన పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. కాగా..మిగతా మంత్రుల్లో చాలా మంది తాము మంత్రులమనే విషయాన్నే మరిచిపోయినట్లుంది. అంతే కాకుండా..గత ‘జగన్‌’ ప్రభుత్వంలో పనిచేసిన వారికే వీరు పెద్దపీట వేశారనే విమర్శలను కొనితెచ్చుకుంటున్నారు. వారి కార్యాలయాల్లో పిఆర్వోఓలుగా వారినే కొనసాగిస్తూ..అవినీతి మరకలు అంటించుకుంటున్నారు. పాలనాపరంగా వీరు కీలకంగా పనిచేయడం లేదు. దీంతో వీళ్లు పేరుకు మంత్రులు తప్ప..చేసేదేమీ ఉండదని వారి స్వంత మనుషులే చెప్పుకుంటున్నారు. మొత్తం మీద.. కూటమి మంత్రుల్లో’ పెక్కుమంది తమశాఖలపై పట్టుసాధించలేక విమర్శలు కొనితెచ్చుకుంటున్నారు. త్వరలో ‘నాగబాబు’కు మంత్రి పదవి ఇవ్వడానికి మంత్రివర్గ విస్తరణ చేస్తారని, ఈ సందర్భంగా ఘోరంగా విఫలమైన ముగ్గురు లేక నలుగురిపై వేటు వేస్తారనే ప్రచారం సాగుతోంది. అయితే..ఎవరిపైనా వేటు వేయరని..ఏడాదిన్నర తరువాతే..వీరిపై వేటు ఉంటుందనే ప్రచారం ఉంది. ఈలోగా అయినా..విఫలం అవుతున్న మంత్రులు…తమ పనితీరు మార్చుకోవాలని, అప్పుడే..వారి మంత్రి పదవి పదిలంగా ఉంటుందనే అభిప్రాయాలు ఉన్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.