ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన కొత్త భౌగోళిక మ్యాప్‌ను APSDMA విడుదల చేసింది. ఈ మ్యాప్‌లో అమరావతిని అధికారిక రాజధానిగా స్పష్టంగా చూపించారు. ఇటీవల అమరావతికి చట్టబద్ధత లభించిన నేపథ్యంలో ఈ మార్పు ప్రాధాన్యం సంతరించుకుంది.
కొత్త మ్యాప్‌లో మొత్తం 28 జిల్లాలు చూపించబడగా, తాజాగా ఏర్పడిన పోలవరం మరియు మార్కాపురం జిల్లాలు కూడా ఇందులో చేర్చబడ్డాయి.
ప్రకృతి విపత్తుల నిర్వహణ, ప్రణాళికలు, మరియు పరిపాలనలో స్పష్టత కోసం ఈ మ్యాప్ కీలక పాత్ర పోషించనుంది. రాష్ట్ర భౌగోళిక నిర్మాణంలో వచ్చిన ఈ మార్పు పాలనలో వేగాన్ని పెంచే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

