శ్రీకాళహస్తి శ్రీ కృష్ణదేవరాయ బలిజ తెలగ కాపు సంఘం అధ్యక్షులు మరియు పట్టణ ప్రముఖుడు ఉప్పు కృష్ణయ్య ఆధ్వర్యంలో కోట్టే సాయి ని ఘనముగా సన్మానించారు. అతి చిన్న వయసులో ఒక సామాన్య జనసైనికుడు నిరాడంబరుడు కొట్టే సాయికి శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వరుని సేవ చేసుకునే భాగ్యం కలగడం పూర్వజన్మ సుకృతం మాకు చాలా సంతోషదాయకమని ఉప్పు కృష్ణయ్య అన్నారు.ఈ సన్మాన కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు బలిజ నాయకులు పాల్గొన్నారు.కొట్టే సాయికి శ్రీకాళహస్తి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ చైర్మెన్ గా అవకాశం కల్పించిన ఆంధ్ర రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడుకి,ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి మరియు శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి కి సభా ముఖంగా ఉప్పు కిష్టయ్య ప్రత్యేక ధన్యవాదములు తెలిపినారు.

కొట్టే సాయి ప్రసాద్ కి ఘన సన్మానం