ముస్తాబాద్ /పున్నమి ప్రతినిధి /ఫిబ్రవరి
బి.ఆర్.ఎస్ అధినేత కేసీఆర్ గారికి సిట్ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో కొండాపూర్ సర్పంచ్ , ఉప సర్పంచ్ మరియు గ్రామ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దిష్టిబొమ్మని దగ్నం చేయడం జరిగింది
ఈ సందర్భంగా గ్రామ శాఖ అధ్యక్షుడు నిమ్మదేవి రెడ్డి గారు మరియు బిఆర్ఎస్ సీనియర్ నాయకులు మంద బాల్ రెడ్డి గారు మాట్లాడుతూ కేవలం రాజకీయంగా కేసీఆర్ గారి పై బురద చల్లడానికి మరియు తమ వైఫల్యాలు అన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రజల దృష్టిని మళ్లించడానికి మాత్రమే ఈ విచారణ విచారణలన్ని ఈరోజు ముందుకు తీసుకొస్తున్నారు
అమలు గాని హామీలు ఇచ్చి ఆరు గ్యారంటీలతో ప్రజలను మభ్యపెట్టి ఈరోజు మీరు అధికారంలోకి వచ్చారు ఆ ఇచ్చిన హామీలను అమలు చేయడానికి చేతకాక ప్రజల దృష్టినీ వాటి నుండి మళ్ళించడానికి ఈరోజు ముఖ్యమంత్రి గారి కార్యక్రమాలన్నీ చేస్తున్నారు
రాష్ట్రంలో యూరియా కోసం రైతులు పాడుతున్న తన్నులాట మీకు కనబడడం లేదా ముఖ్యమంత్రి గారు రైతు భరోసా లేదు రైతు బందు లేదు కల్యాణ లక్ష్మి లేదు తులం బంగారం లేదు మీ 6 గ్యారంటీల్లో మీరు అమలు చేసింది ఏందో ఒక్కసారి చెప్పండి
అబద్ధపు విచారణలు ఎన్ని నిందలు పెట్టిన భయపడేటోళ్ళం మేము కాదు మా నాయకుడి వెనుక యావత్ తెలంగాణ ప్రజలందరూ ఉన్నారు కచ్చితంగా ఇచ్చిన హామీలను నెరవేర్చదాక ఊరుకునే పరిస్థితి లేవు
అబద్ధపు ఆరోపణలు చేస్తే కచ్చితంగా మా బిఆర్ఎస్ శ్రేణుల కూడా ఎప్పటికప్పుడు సింహంలా గర్జిస్తూనే ఉంటాం
ఖబర్దార్ రేవంత్ రెడ్డి
ఇటి కార్యక్రమంలో కొండాపూరు బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నారు


