ఘనంగా కొండయ్య వలస గ్రామంలో భీష్మ ఏకాదశి
అగనంపూడి, జనవరి 29, పున్నమి ప్రతినిధి.
జీవీఎంసీ 85 వార్డు కొండయ్య వలస గ్రామంలో శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో మల్లపురెడ్డి చంద్రయ్య దాసు, భక్త తులసి దాసు జ్ఞాపకార్థం భీష్మ ఏకాదశి సందర్భంగా ఉదయం నుండి ప్రత్యేక పూజలు జరిగినవి. శ్రీ మరిడిమాంబ మహిళా సమితి వారిచే విష్ణు సహస్రనామ పారాయణం, వివిధ బృందాలు హరి భజన కార్యక్రమం కను రమ్యంగా జరిగినది. ఆలయ కమిటీ గ్రామ పెద్దలు ఐ ఆర్ సి హెచ్ అప్పారావు, విందుల వెంకటరమణ, బలిరెడ్డి సత్యనారాయణ, మరిసా రామచంద్రరావు, బలిరెడ్డి శ్రీను, సాయిన సన్యాసిరావు, విందుల మాణిక్యం, బుదిరెడ్డి అప్పారావు, బుదిరెడ్డి పైడ్రాజు, బుదిరెడ్డి కన్నారావు, మరిసా నాగేశ్వరరావు , బలి రెడ్డి వెంకటేష్ , విందుల కిషోర్, విందుల గణేష్, విందుల నవీన్ మరియు గ్రామ పెద్దలు భక్తులు మహిళలు విశేషంగా పాల్గొన్నారు.



