కైలాసపురం వాసులు వసంత కుమార్ ఎల్లపు, వారి మిత్రబృందం కలిసి ధర్మశాస్త్ర దేవాలయం గురుస్వామి పర్యవేక్షణలో అయ్యప్ప మాలలు ధరించి నియమ నిష్ఠలతో పూజా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు. భగవంతుని అనుగ్రహంతో నేడు దేవాలయంలో జరిగే నిత్య అన్నదాన సేవలో భాగంగా బిక్షణ సమకూర్చే అదృష్టం లభించడం తమ మిత్రబృందానికి దైవకృపగా భావిస్తున్నామని వసంత కుమార్ పేర్కొన్నారు.
అయ్యప్ప స్వామి కరుణాకటాక్షంతో అనేక పర్యాయాలు దీక్ష చేపట్టి సేవ చేసే అవకాశం లభించడం తమకు అతి పెద్ద భాగ్యమని ఆయన తెలిపారు. శనివారం అన్నదాన కార్యక్రమంలో అనేకమంది మాలధారీ స్వాములు పాల్గొని భక్తి భావంతో బిక్షణ స్వీకరించగా, “అన్నదాత సుఖీభవ” అంటూ ఆశీర్వచనాలు అందించారు.
భక్తి పూర్వకంగా, నిబద్ధతతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వసంత కుమార్ మిత్రబృందాన్ని పలువురు స్వాములు ప్రశంసలతో అభినందించారు. సేవ, సమర్పణ, సత్సంకల్పాల స్ఫూర్తిగా నిలిచిన ఈ భక్తి యాత్ర కైలాసపురం ధర్మశాస్త్ర దేవాలయంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత మంగళమయం చేసింది.


