కేపీపోర్ట్ పరిశ్రమలపై నీలిమేఘాలు
భూములు కేటాయింపు రద్దుచేసిన ఏపీఐఐసీ
కోర్టుకెక్కిన పోర్ట్ యాజమాన్యం
పరిశ్రమలకిచ్చిన భూమితో పోర్టు వ్యాపారం చేసిందంటోన్న ఏపీఐఐసీ.
నెల్లూరు, అక్టోబర్ 26 (పున్నమి ప్రతినిధి) : పారిశ్రామిక ప్రగతికోసం నెల్లూరు జిల్లాలో పలు పరిశ్రమలకిచ్చిన భూముల వ్యవహారం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.. ప్రత్యేకించి క ష్ణపట్నం పోర్ట్ ఆధారిత పరిశ్రమలకిచ్చిన ల్యాండ్స్ ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వానికి, పార్టీకి మధ్య వివాదానికి తెరలేపాయి.. దాదాపు 9 ఏళ్ల క్రితం పరిశ్రమలకిచ్చిన భూముల్లో భూవ్యాపారం తప్ప పారిశ్రామిక ప్రగతిలేదంటూ ఏపీ ఐసీసీ పార్టీకి ఇచ్చిన భూములను వెనక్కి తీసుకుంది.. ఏపీఐఐసీ నిర్వాహకం వల్లనే ప్రగతిలేదంటూ కేపి పోర్ట్ కోర్టుకెక్కింది..దీంతో ఈవ్యవహారం వివాదాస్పదంగా మారింది… వివరాల్లోకెళితే…
కేపి పోర్ట్ ఇన్ ఫ్రాటెక్ ప్రయివేట్ లిమిటెడ్‌కు 2009లో కేటాయించిన 4731 ఎకరాల భూమిని వెనుకకు తీసుకుంటున్నట్లు భూకేటాయింపును రద్దు చేసినట్లు ఏపీఐఐసీ ప్రకటించింది. క ష్ణ పట్నం పోర్టుకు అనుబంధంగా పరిశ్రమల అభివ ద్ది కొసము నెల్లూరు జిల్లాలోబి చిల్లకూరు,కోట మండలాల పరిదిలో 4731.15 ఎకరాల భూమిని ఎకరా 1.15లక్షలతో కేపిఐఎల్ కు కేటాయించారు. అయితే భూమి ఇచ్చి 9సంవత్సరాలు అయినప్ప టికి ఇప్పటి వరకు ఎలాంటి పరిశ్రమ స్థాపించ లేదని ఏపిఐసిసి అంటుంది.దీనికి తోడు ఈ భూముల ను తనఖా ఉంచి మూడు బ్యాంకులలో 1935 కోట్లు రుణం పొందింది.అయితే రుణం తీసుకునే టప్పుడు ఎపీఐఐసి నుంచి ఎన్ ఓసీ తీసుకోలేదని ఎపీఐఐసీ అదికారుల వాదన.పలు మార్లు నోటీసులు జారీ చేసిన కేపీఐఎల్ పట్టించుకోక పోవడంతో భూముల కేటాయింపును రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.అయితే ఈ స్థలం లో ఓ ఇంటర్ నేషనల్ స్కూల్ ను కేపీఐఎల్ ఏర్పాటు చేసింది.పరిశ్రమ కోసం భూములిస్తే పోర్ట్ సొంతవ్యాపారం.. భూ వ్యాపారాలు చేస్తుందని ఏపీఐఐసీ ఆరోపిస్తోంది..
ప్రభుత్వం పరిశ్రమల కోసం ఇచ్చిన భూములను బ్యాంకుల్లో తనఖా పెట్టి భారీగా రుణాలు పొందడం నిబంధనలకు విరుద్ధమని రాష్ట్ర పారిశ్రామిక మౌళిక సదుపాయాల కల్పనాసంస్థ ఆరోపిస్తూ ఇచ్చిన భూములను రద్దుచేసింది.. పోర్ట్ భూముల వ్యవహారంలో యాజమాన్యం స్పందించింది.. న్యాయపరమైన అంశాలతో పారిశ్రామిక ప్రగతివైపు వెళ్తున్నామంటూ.. ఏపీఐఐసీ నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేసింది. భూముల రద్దు ఏకపక్షంగా ఉందని,ఏపీఐఐసీ రద్దు ఉత్తర్వులు రద్దు చేయాలని కోర్టును కోరింది.. భూ బదలాయింపు లో అన్ని నిబంధనలు పూర్తిచేసుకున్న 9 ఏళ్ల అనంతరం రద్దు చేయడమే మిటంటూ ప్రశ్నిస్తోంది..పోర్టు..
ఏపీఐఐసీ నుంచి విక్రయ దస్తావేజులప్రకారం 4,731 ఎకరాల భూమిని రూ.65.07 కోట్లకు కొనుగోలు చేసి.. రిజర్వేషన్లు పూర్తయ్యాయని పోర్ట్ కోర్టుకు తెలిపింది.. ఏపీఐఐసీ తో జరిగిన ఒప్పందం ప్రకారం మరో 1,298 ఎకరాలు ఇవ్వాలని కోరి ఉన్నా 2012 నుంచి సమాధానం లేదని పోర్ట్ వాదిస్తోంది.. మొత్తం భూములను కేటాయించకుండా పరిశ్రమ స్థాపన ఎలా జరుగుతుందనేది పోర్టు ప్రశ్న… ఒకవైపు ఏపీఐఐసీ, ఇంకోవైపు పోర్ట్ కోర్టు వ్యవహారాల తో ఇప్పుడు క ష్ణపట్నం పోర్టు భూ వ్యవహారం పారిశ్రామిక వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.. భూముల రద్దుపై పోర్ట్ కోర్టుకెక్కిన నేపథ్యంలో ఏపీఐఐసీ నివేదన ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే..


