Friday, 6 February 2026
  • Home  
  • కేజీబీవీ విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు — చిట్వేలి పీహెచ్‌సీ ఆధ్వర్యంలో శిబిరం – విద్యార్థులకు పరీక్షలు చేసిన ఆప్తలామిక్ అధికారి ఓబులేసు
- అన్నమయ్య

కేజీబీవీ విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు — చిట్వేలి పీహెచ్‌సీ ఆధ్వర్యంలో శిబిరం – విద్యార్థులకు పరీక్షలు చేసిన ఆప్తలామిక్ అధికారి ఓబులేసు

చిట్వేలి మండలంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో విద్యార్థినుల కోసం గురువారం ఉచిత కంటి పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు. చిట్వేలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) వైద్యుడు డాక్టర్ మహమ్మద్ అన్సారి ఆధ్వర్యంలో ఈ శిబిరం జరిగింది. ఆప్తలామిక్ అధికారి ఓబులేసు విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి, కంటి సమస్యలున్న వారికి తగిన సూచనలు, సలహాలు అందించారు.కంటి చూపులో లోపాలు ఉన్న విద్యార్థులను గుర్తించి, వారికి అవసరమైన చికిత్స లేదా కళ్లద్దాలు అందించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు వైద్యులు తెలిపారు.ఈ కార్యక్రమంలో కేజీబీవీ ప్రిన్సిపాల్ తులసి, హెల్త్ ఆఫీసర్ విజయ్ కుమార్, హెచ్.పి. యా భాను, ఏ.ఎన్.ఏ. ఫరీదా సహా పలువురు ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థినుల ఆరోగ్య సంరక్షణ కోసం ఇలాంటి శిబిరాలు తరచూ నిర్వహిస్తామని ప్రిన్సిపాల్ తెలిపారు.

చిట్వేలి మండలంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో విద్యార్థినుల కోసం గురువారం ఉచిత కంటి పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు.
చిట్వేలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) వైద్యుడు డాక్టర్ మహమ్మద్ అన్సారి ఆధ్వర్యంలో ఈ శిబిరం జరిగింది. ఆప్తలామిక్ అధికారి ఓబులేసు విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి, కంటి సమస్యలున్న వారికి తగిన సూచనలు, సలహాలు అందించారు.కంటి చూపులో లోపాలు ఉన్న విద్యార్థులను గుర్తించి, వారికి అవసరమైన చికిత్స లేదా కళ్లద్దాలు అందించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు వైద్యులు తెలిపారు.ఈ కార్యక్రమంలో కేజీబీవీ ప్రిన్సిపాల్ తులసి, హెల్త్ ఆఫీసర్ విజయ్ కుమార్, హెచ్.పి. యా భాను, ఏ.ఎన్.ఏ. ఫరీదా సహా పలువురు ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థినుల ఆరోగ్య సంరక్షణ కోసం ఇలాంటి శిబిరాలు తరచూ నిర్వహిస్తామని ప్రిన్సిపాల్ తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.