ఘనంగా యువనేత పుట్టినరోజు వేడుకలు
వరికుంటపాడు మండలం తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పోలుబోయిన శ్రీకాంత్ యాదవ్ జన్మదిన వేడుకలు మండల కేంద్రమైన వరికుంటపాడు లోని సొసైటీ కార్యాలయంలో తెలుగు యువత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జన్మదిన కేకును కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం టిడిపి మండల కన్వీనర్ చండ్రా మధుసూదన్ రావు, జడ్పిటిసి రావిళ్ల నాగేంద్ర, సొసైటీ అధ్యక్షులు గుర్రం గోపి, మండల క్లస్టర్ ఇంచార్జి పోక మహేష్, మండల తెలుగు యువత అధ్యక్షులు లక్ష్మీనారాయణ, మండల వైస్ ఎంపీపీ దేవనబోయిన మధు, యూనిట్ ఇన్చార్జి నాదెండ్ల రాజా, గ్రామ పార్టీ అధ్యక్షులు పొద మాధవరావు, మాజీ సర్పంచ్ ఆండ్రా బాల గురువారెడ్డి, ఆండ్రా శివరామిరెడ్డి, లింగం మాలకొండయ్య,ఆరికొండ వెంకటరత్నం, కామేపల్లి శ్రీనివాసులు,గుర్రం కొండలరావు, చంచల బొజ్జయ్య, టిడిపి నాయకులు జనసేన పార్టీ నాయకులు తదితరులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు.


