నకిరేకల్ :సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి)
జల సంరక్షణ మరియు ప్రజల భాగస్వామ్యం (జల్ సంచాయ్ జౌర్ జన్ బాగేదార్ జె ఎస్ జె బి)విభాగంలో తెలంగాణలోని నల్గొండ,ఆదిలాబాద్, మరియు మంచిర్యాల జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక జాతీయ పురస్కారం ప్రకటించడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి పోటీపడిన జిల్లాల్లో తొలి మూడు స్థానాలను తెలంగాణ జిల్లాలే దక్కించుకోగా అందులో నల్గొండ జిల్లా
ఈ పురస్కారం క్రింద రెండు కోట్ల రూపాయలు పురస్కారం పొందింది ఈ అద్భుతమైన గుర్తింపు సాధించినందుకు గాను రాష్ట్ర ముఖ్యమంత్రి నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠిని, జిల్లా అధికారులను,
ప్రజలను అభినందించారు.జల సంరక్షణలో జిల్లాకు అవార్డు రావడం పై జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పందిస్తూ నల్గొండ జిల్లాకు ఇటువంటి అవార్డు రావడం మొదటి సారి అని ఈ ఘనత ఉపాధి హామీ సిబ్బందికి దక్కుతుందని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక జాతీయ పురస్కారం పొందిన :నల్గొండ జిల్లా
నకిరేకల్ :సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి) జల సంరక్షణ మరియు ప్రజల భాగస్వామ్యం (జల్ సంచాయ్ జౌర్ జన్ బాగేదార్ జె ఎస్ జె బి)విభాగంలో తెలంగాణలోని నల్గొండ,ఆదిలాబాద్, మరియు మంచిర్యాల జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక జాతీయ పురస్కారం ప్రకటించడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి పోటీపడిన జిల్లాల్లో తొలి మూడు స్థానాలను తెలంగాణ జిల్లాలే దక్కించుకోగా అందులో నల్గొండ జిల్లా ఈ పురస్కారం క్రింద రెండు కోట్ల రూపాయలు పురస్కారం పొందింది ఈ అద్భుతమైన గుర్తింపు సాధించినందుకు గాను రాష్ట్ర ముఖ్యమంత్రి నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠిని, జిల్లా అధికారులను, ప్రజలను అభినందించారు.జల సంరక్షణలో జిల్లాకు అవార్డు రావడం పై జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పందిస్తూ నల్గొండ జిల్లాకు ఇటువంటి అవార్డు రావడం మొదటి సారి అని ఈ ఘనత ఉపాధి హామీ సిబ్బందికి దక్కుతుందని అన్నారు.

