Monday, 30 March 2026
  • Home  
  • కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మె
- రాజన్న సిరిసిల్ల

కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మె

రాజస్థాన్ రాష్ట్రంలోని శ్రీకార్ జిల్లాలో జరుగుతున్న సీఐటీయూ, సీడబ్ల్యూఎఫ్ఐ జాతీయ సమావేశాల్లో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు, కేంద్ర ప్రతినిధులు దేశవ్యాప్తంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ – కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లు కార్మిక వర్గానికి తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చట్టాల వల్ల కార్మిక హక్కులు హరించబడుతున్నాయని, ఉద్యోగ భద్రత కోల్పోతున్నారని, కార్మిక చట్టాల రక్షణ పూర్తిగా దెబ్బతింటోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 12న నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర సీఐటీయూ నాయకత్వం పిలుపునిచ్చింది. రాజస్థాన్ రాష్ట్రం నుంచి తెలంగాణ ప్రజలకు, కార్మికులకు, రైతులకు, రైతు కూలీలకు ప్రత్యేక విజ్ఞప్తి చేస్తూ – ఈ సమ్మెలో ప్రతి ఒక్కరూ పాల్గొని కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించాలని కోరారు. కార్మికుల కనీస వేతనాల పెంపు, ఉద్యోగ భద్రత కల్పన, నాలుగు లేబర్ కోడ్ల రద్దు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపడం వంటి ప్రధాన డిమాండ్ల సాధన కోసం ఈ సమ్మె నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు ఈ పోరాటంలో భాగస్వాములు కావాలని సీఐటీయూ రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేసింది. కార్మిక హక్కుల పరిరక్షణ కోసం ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

రాజస్థాన్ రాష్ట్రంలోని శ్రీకార్ జిల్లాలో జరుగుతున్న సీఐటీయూ, సీడబ్ల్యూఎఫ్ఐ జాతీయ సమావేశాల్లో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు, కేంద్ర ప్రతినిధులు దేశవ్యాప్తంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ – కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లు కార్మిక వర్గానికి తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చట్టాల వల్ల కార్మిక హక్కులు హరించబడుతున్నాయని, ఉద్యోగ భద్రత కోల్పోతున్నారని, కార్మిక చట్టాల రక్షణ పూర్తిగా దెబ్బతింటోందని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 12న నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర సీఐటీయూ నాయకత్వం పిలుపునిచ్చింది.
రాజస్థాన్ రాష్ట్రం నుంచి తెలంగాణ ప్రజలకు, కార్మికులకు, రైతులకు, రైతు కూలీలకు ప్రత్యేక విజ్ఞప్తి చేస్తూ – ఈ సమ్మెలో ప్రతి ఒక్కరూ పాల్గొని కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించాలని కోరారు.
కార్మికుల కనీస వేతనాల పెంపు, ఉద్యోగ భద్రత కల్పన, నాలుగు లేబర్ కోడ్ల రద్దు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపడం వంటి ప్రధాన డిమాండ్ల సాధన కోసం ఈ సమ్మె నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు ఈ పోరాటంలో భాగస్వాములు కావాలని సీఐటీయూ రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేసింది. కార్మిక హక్కుల పరిరక్షణ కోసం ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.