Thursday, 5 February 2026
  • Home  
  • కేంద్రం జాతీయ ఉపాధి హామి పథకం పేరు మార్చడం పై నిరసన : కాంగ్రెస్*
- విశాఖపట్నం

కేంద్రం జాతీయ ఉపాధి హామి పథకం పేరు మార్చడం పై నిరసన : కాంగ్రెస్*

*కేంద్రం జాతీయ ఉపాధి హామి పథకం పేరు మార్చడం పై నిరసన : కాంగ్రెస్* *విశాఖపట్నం డిసెంబర్ 18 పున్నమి ప్రతినిధి* మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం యూ పి ఏ ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామి పథకం దేశంలో పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడిందని, అలాంటి పథకాన్ని నిర్వీర్యం చేస్తూ జాతి పిత మహాత్మా గాంధీ పేరు తొలగించడం అన్యాయం అని విశాఖ జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షులు ఎల్ ఎన్ హాసిని వర్మ అన్నారు. మాజీ ఇంచార్జ్ డీసీసీ వజపర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ దేశంలో మహాత్ముల పేర్లు బీజేపీ ప్రభుత్వం చూసి తట్టుకోలేకపోతోందని ఆయన అన్నారు. రాష్ట్ర స్పోర్ట్స్ సెల్ చైర్మన్ కమలాకర్ మాట్లాడుతూ ఉపాధి హామి పథకం పై కుట్రలు తగవని బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. విశాఖ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ ప్రియాంక దండి మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం పేరు మార్చడమే కాకుండా గత కొంత కాలంగా నిధులు కోత విదిస్తున్నారని, ప్రస్తుతం తీసుకువచ్చిన సవరణలో దేశ వ్యాప్తంగా సుమారు 30 వేల కోట్లు పథకానికి కోత విధించునున్నారని, అందులో ఆంధ్రప్రదేశ్ కి 3 వేల నుండి 5 వేల వరకు పేరు మార్చి సవరణ చేసిన కొత్త కే వి జీ రామ్ జీ గ్రామీణ ఉపాధి పథకం ద్వారా రాష్ట్రాల మీద కేంద్ర ప్రభుత్వం భారం పెంచనుందని, అందరు పేరు మాత్రమే మార్చారని అనుకుంటున్నారని, పేరుతో రాజకీయం చేసి, అందరిని పేరు చుట్టూ చర్చలో తిప్పి పెద్ద ఎత్తున ఈ పథకంలో నిధుల కోత పెట్టడమే కేంద్ర ప్రభుత్వం కుట్ర అని ప్రియాంక అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహేష్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాండవ గాయత్రి,జిల్లా ఎస్ సి సెల్ చైర్మన్ పద్మిని చంద్రశేఖర్,పీసీసీ మెంబెర్ వై ఎస్ జగన్,దక్షిణ నియోజకవర్గ ఇంచార్జ్ కే వి సూర్యనారాయణ,భీమిలి ఇంచార్జ్ రామకృష్ణ, గాజువాక మాజీ కన్వీనర్ గవర వెంకటరమణ, సీనియర్ నాయకులు గుత్తుల శ్రీనివాస్, జర్రిపోతుల ముత్యాలనాయుడు, ఉమ్మిడి భాస్కర్,సేవాదళ్ జాతీయ కార్యదర్శి గంగాధర్, ఫర్వీన్ ఖాన్,అప్పారావు, మోహన్, వేమూరి సురేష్,డా.విజయ్ చంద్రా,బాషా, అక్రమాని రమణ తదితరులు పాల్గొన్నారు.

*కేంద్రం జాతీయ ఉపాధి హామి పథకం పేరు మార్చడం పై నిరసన : కాంగ్రెస్*
*విశాఖపట్నం డిసెంబర్ 18 పున్నమి ప్రతినిధి*
మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం యూ పి ఏ ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామి పథకం దేశంలో పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడిందని, అలాంటి పథకాన్ని నిర్వీర్యం చేస్తూ జాతి పిత మహాత్మా గాంధీ పేరు తొలగించడం అన్యాయం అని విశాఖ జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షులు ఎల్ ఎన్ హాసిని వర్మ అన్నారు. మాజీ ఇంచార్జ్ డీసీసీ వజపర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ దేశంలో మహాత్ముల పేర్లు బీజేపీ ప్రభుత్వం చూసి తట్టుకోలేకపోతోందని ఆయన అన్నారు. రాష్ట్ర స్పోర్ట్స్ సెల్ చైర్మన్ కమలాకర్ మాట్లాడుతూ ఉపాధి హామి పథకం పై కుట్రలు తగవని బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. విశాఖ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ ప్రియాంక దండి మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం పేరు మార్చడమే కాకుండా గత కొంత కాలంగా నిధులు కోత విదిస్తున్నారని, ప్రస్తుతం తీసుకువచ్చిన సవరణలో దేశ వ్యాప్తంగా సుమారు 30 వేల కోట్లు పథకానికి కోత విధించునున్నారని, అందులో ఆంధ్రప్రదేశ్ కి 3 వేల నుండి 5 వేల వరకు పేరు మార్చి సవరణ చేసిన కొత్త కే వి జీ రామ్ జీ గ్రామీణ ఉపాధి పథకం ద్వారా రాష్ట్రాల మీద కేంద్ర ప్రభుత్వం భారం పెంచనుందని, అందరు పేరు మాత్రమే మార్చారని అనుకుంటున్నారని, పేరుతో రాజకీయం చేసి, అందరిని పేరు చుట్టూ చర్చలో తిప్పి పెద్ద ఎత్తున ఈ పథకంలో నిధుల కోత పెట్టడమే కేంద్ర ప్రభుత్వం కుట్ర అని ప్రియాంక అన్నారు.

కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహేష్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాండవ గాయత్రి,జిల్లా ఎస్ సి సెల్ చైర్మన్ పద్మిని చంద్రశేఖర్,పీసీసీ మెంబెర్ వై ఎస్ జగన్,దక్షిణ నియోజకవర్గ ఇంచార్జ్ కే వి సూర్యనారాయణ,భీమిలి ఇంచార్జ్ రామకృష్ణ, గాజువాక మాజీ కన్వీనర్ గవర వెంకటరమణ, సీనియర్ నాయకులు గుత్తుల శ్రీనివాస్, జర్రిపోతుల ముత్యాలనాయుడు, ఉమ్మిడి భాస్కర్,సేవాదళ్ జాతీయ కార్యదర్శి గంగాధర్, ఫర్వీన్ ఖాన్,అప్పారావు, మోహన్, వేమూరి సురేష్,డా.విజయ్ చంద్రా,బాషా, అక్రమాని రమణ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.