Friday, 6 February 2026
  • Home  
  • కేంద్రం ఇచ్చిన యూరియా ని దోచుకుంది ఎవరు….
- ఖమ్మం

కేంద్రం ఇచ్చిన యూరియా ని దోచుకుంది ఎవరు….

ఖమ్మం పున్నమి ప్రతినిధి 👉రైతులు పడుతున్న యూరియా కష్టాలు మీద మండల తహసీల్దార్ కి వినతి పత్రం ఇచ్చిన బిజెపి బృందం 👉పాల్గొన్న నంబూరి రామలింగేశ్వరావ్ సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరు పట్టణంలో యూరియా కొరతపై రైతులతో కలసి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.కల్లూరు మండల అధ్యక్షుడు గుమ్మా రామకృష్ణ ఆధ్వర్యంలో అంబేద్కర్ కు పూలమాలవేసి బైక్ ర్యాలీ నిర్వహించి సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ ను కలిసి వినతి పత్రం అందించడం జరిగింది.ఈ నిరసన కార్యక్రమానికి ఖమ్మం పార్లమెంట్ కన్వీనర్ నంబూరి రామలింగేశ్వర రావు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా యూరియా కొరత లేనిది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు వచ్చింది దీనికి కారణం ఎవరు? 2024 వర్షాకాలం ఖరీఫ్ సీజన్ కు రాష్ట్ర ప్రభుత్వం 10.40 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అడిగితే కేంద్రం 12. 89 లక్షల మెట్రిక్ టన్నులు రాష్ట్రానికి ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం వినియోగించిన యూరియా 9.66 లక్షల మెట్రిక్ టన్నులు అంటే రాష్ట్రంలో మిగులు యూరియా 3.23 లక్షల టన్నులు. 2024 డిసెంబర్ వేసంగి సాగుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని 3.17 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కావాలని అడిగితే కేంద్ర ప్రభుత్వం బిజెపి పాలిత ప్రాంతల మాదిరిగానే 5.04 లక్షల టన్నుల యూరియా అందించింది. దీనిలో రాష్ట్ర ప్రభుత్వం వినియోగించిన యూరియా కేవలం 1.28 లక్షల మెట్రిక్ టన్నులు, ఏ ప్రకారం చూసిన 2024లో రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న మిగులు యూరియా 6.99 లక్షల మెట్రిక్ టన్నులు,అంటే దాదాపు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర 7 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉండాలి. 2025 జనవరి నుండి మార్చి వరకు మరో 2.01 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అందించింది. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం వద్ద తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉండాలి.కానీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తుందని చెబుతుంది.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిచి తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఎక్కడుంది, ఎవరి వద్ద ఉంది అన్నది దర్యాప్తు చేసి దోషులను కఠినంగా శిక్షించి రైతులకు తగినంత యూరియా అందించవలసిందిగా కోరారు. లేని పక్షాన నష్టపోయిన ప్రతి ఎకరాకు 25 వేల చొప్పున నష్టపరిహారం అందించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది.ఈ కార్యక్రమంలో కల్లూరు మండలం ప్రబారి కుమిలి శ్రీనివాస్ తుమ్మలపూడి పుల్లారావు మండల వెంకటరామిరెడ్డి చాలా అప్పారావు పసుపులేటి సుబ్బారావు గురి వెంకటరామయ్య కిసాన్ మోర్చా అధ్యక్షుడు ఆనంది నరసింహారావు రంగు రవి వంగల శ్రీనివాసరావు జరకల నాగులు కల్లేపల్లి భీమరాజు కృష్ణ రెడ్డి వినయ్ వెంకటేశ్వరరావు చాట్ల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం పున్నమి ప్రతినిధి

👉రైతులు పడుతున్న యూరియా కష్టాలు మీద మండల తహసీల్దార్ కి వినతి పత్రం ఇచ్చిన బిజెపి బృందం
👉పాల్గొన్న నంబూరి రామలింగేశ్వరావ్

సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరు పట్టణంలో యూరియా కొరతపై రైతులతో కలసి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.కల్లూరు మండల అధ్యక్షుడు గుమ్మా రామకృష్ణ ఆధ్వర్యంలో అంబేద్కర్ కు పూలమాలవేసి బైక్ ర్యాలీ నిర్వహించి సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ ను కలిసి వినతి పత్రం అందించడం జరిగింది.ఈ నిరసన కార్యక్రమానికి ఖమ్మం పార్లమెంట్ కన్వీనర్ నంబూరి రామలింగేశ్వర రావు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా యూరియా కొరత లేనిది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు వచ్చింది దీనికి కారణం ఎవరు? 2024 వర్షాకాలం ఖరీఫ్ సీజన్ కు రాష్ట్ర ప్రభుత్వం 10.40 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అడిగితే కేంద్రం 12. 89 లక్షల మెట్రిక్ టన్నులు రాష్ట్రానికి ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం వినియోగించిన యూరియా 9.66 లక్షల మెట్రిక్ టన్నులు అంటే రాష్ట్రంలో మిగులు యూరియా 3.23 లక్షల టన్నులు. 2024 డిసెంబర్ వేసంగి సాగుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని 3.17 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కావాలని అడిగితే కేంద్ర ప్రభుత్వం బిజెపి పాలిత ప్రాంతల మాదిరిగానే 5.04 లక్షల టన్నుల యూరియా అందించింది. దీనిలో రాష్ట్ర ప్రభుత్వం వినియోగించిన యూరియా కేవలం 1.28 లక్షల మెట్రిక్ టన్నులు, ఏ ప్రకారం చూసిన 2024లో రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న మిగులు యూరియా 6.99 లక్షల మెట్రిక్ టన్నులు,అంటే దాదాపు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర 7 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉండాలి. 2025 జనవరి నుండి మార్చి వరకు మరో 2.01 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అందించింది. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం వద్ద తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉండాలి.కానీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తుందని చెబుతుంది.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిచి తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఎక్కడుంది, ఎవరి వద్ద ఉంది అన్నది దర్యాప్తు చేసి దోషులను కఠినంగా శిక్షించి రైతులకు తగినంత యూరియా అందించవలసిందిగా కోరారు. లేని పక్షాన నష్టపోయిన ప్రతి ఎకరాకు 25 వేల చొప్పున నష్టపరిహారం అందించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది.ఈ కార్యక్రమంలో కల్లూరు మండలం ప్రబారి కుమిలి శ్రీనివాస్ తుమ్మలపూడి పుల్లారావు మండల వెంకటరామిరెడ్డి చాలా అప్పారావు పసుపులేటి సుబ్బారావు గురి వెంకటరామయ్య కిసాన్ మోర్చా అధ్యక్షుడు ఆనంది నరసింహారావు రంగు రవి వంగల శ్రీనివాసరావు జరకల నాగులు కల్లేపల్లి భీమరాజు కృష్ణ రెడ్డి వినయ్ వెంకటేశ్వరరావు చాట్ల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.