పున్నమి అక్టోబర్ 31 గోదావరిఖని: ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏఐటీయూసీ రామగుండం నగర సమితి ఆధ్వర్యంలో గోదావరిఖని డిపో ముందున్న ఆర్ టి సి ఎంప్లాయిస్ యూనియన్ జెండాకు ఏఐటీయూసీ రామగుండం నగర కమిటీ ప్రధాన కార్యదర్శి శనగరపు చంద్రశేఖర్ ఏఐటీయూసీ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. బ్రిటీష్ పాలనలోనే కార్మిక హక్కుల కోసం, చట్టాల కోసం పోరాడి గత 100 సంవత్సరాలుగా సంవత్సరాలుగా 44 కార్మిక చట్టాలను సాధించింది ఏఐటీయూసీ.
కానీ నేడు కేంద్రంలో బిజెపి మోడి ప్రభుత్వం కార్మిక హక్కులను హరించే విధంగా 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ తీసుకు వచ్చి వ్యాపారం సులభతరం చేసేందుకు ఆదా అని అంబానీలకు లాభం చేకూర్చే విధంగా కార్మికులకు ద్రోహం చేస్తుందని అవి రద్దు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని కార్మిక వర్గానికి పిలుపు నిచ్చారు. బొంబాయి నగరంలో 1920 అక్టోబర్ 31 వ తేదీన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు లాలా లజపతిరాయ్ అధ్యక్షతన ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) ఏర్పడిందని, నాటి నుంచి కార్మికవర్గ హక్కుల కోసమేగాక దేశ స్వాతంత్ర్యం కోసం అనేక పోరాటాలు చేసిందన్నారు. ఆ తర్వాత ఆధునిక భారతదేశ నిర్మాణం కోసం అద్వితీయమైన కృషి చేసి, అసాధారణ త్యాగాలు, బలిదానాలు, పోలీసు దాష్టీకాలు,పెట్టుబడుదార్ల గూండాల దాడులు, యావత్ జీవిత శిక్షలు, మరణ దండనలతో ఉన్న సమయంలో యావత్ కార్మిక,ప్రజల పక్షాన ఏఐటీయూసీ ముందుండి పోరాడిందన్నారు. కోట్లాది మంది కార్మికవర్గ గొంతుకగా వారి గుండెల్లో స్థానం సంపాదించుకుందని, ఏఐటీయూసీ ఒకానొక చారిత్రక నేపథ్యంలో ఏర్పడిందని వారు కొనియాడారు.సామ్రాజ్యవాదులు విధించిన నూతన రాజ్యాంగ చట్టానికి బదులుగా “వయోజన ఓటింగ్” హక్కుతో ఒక “రాజ్యాంగ సభ”ను ఏర్పాటు చేయాలని ఏఐటీయూసీ డిమాండ్ చేసిందన్నారు. సంపూర్ణ స్వాతంత్ర్యం అనే నినాదం ఈ డిమాండ్ ను మొదటి సారిగా లేవనెత్తిన ఘనత ఏఐటీయూసీకే దక్కుతుందన్నారు.ఏఐటీయూసీ స్వాతంత్య్ర పోరాటంలో కీలక భాగంగా వ్యవహరించింది. అందువల్లనే, స్వాతంత్ర్యానంతరం ఏర్పడిన తర్వాత రాజ్యాంగంలో కొన్ని కార్మిక హక్కులకు కొద్దిపాటి హామీలు కల్పించారన్నారు. గత 105 సంవత్సరాలుగా కార్మిక వర్గం అనేక పోరాటాలు, త్యాగాలు చేసి మరి కొన్ని హక్కులను సాధించుకోగలిగింది. కానీ వాటి అమలులో మాత్రం ప్రభుత్వాలు ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. న్యాయస్థానాలలోనూ కార్మికులకు సరైన న్యాయం దొరకటం లేదు. కేంద్రంలో నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత, 29 కార్మిక చట్టాలను రద్దుచేసి, 4 ‘కోడ్స్’గా అమల్లోకి తీసుకు వస్తున్నారు. కార్మిక వర్గాన్ని బ్రిటీష్ కాలం నాటి దుర్భర పరిస్థితికి నెట్టేస్తున్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం. *ఇప్పుడేమో నాలుగు కార్మిక కోడ్ల కొనసాగింపుగా “శ్రమ్ శక్తి ఎన్ఐటీఐ 2026” పేరుతో నూతన జాతీయ కార్మిక విధానాన్ని ముందుకు తీసుకొస్తున్నారని, వీటిని రద్దు చేయకుంటే పోరాటాలు తప్పవని ఏఐటీయూసీ రామగుండం నగర సమితి అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు అబ్దుల్ కరీం, శనిగరపు చంద్రశేఖర్ లు హెచ్చరించారు*.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు బిక్షపతి,మసూద్ దరిపెల్లి శ్రీనివాస్, మామిడిపల్లి శ్రీనివాస్, కార్మికులు శనిగరపు మతీనా ముర్స లీన్ శేఖర్ శంకర్ శనిగరపు తిరుమల, ఉషాకోయిలా రసజ్ఞ, బి అనిల్ కుమార్,కాసిపేట రాజేశ్వరి,రామగిరి లక్ష్మి, ఠాకూర్ కళావతి, పుల్యాల రాధా, బొందెల సంగీత, పొడి శెట్టి సుగుణ వసంత, పురుషోత్తం పావురం తదితరులు పాల్గొన్నారు.

కేంద్రంలో బిజెపి మోడీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను కొనసాగిస్తూ, 4 లేబర్ కోడ్స్ రద్దు చేసేవరకు పోరాడాలి.. ఏఐటీయూసీ రామగుండం నగర సమితి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అబ్దుల్ కరీం, శనిగరపు చంద్రశేఖర్ లా పిలుపు కనీస వేతనం 26 వేలు ఇవ్వాలి ఏఐటీయూసీ 106వ జయంతోత్సవాలను వారం రోజులపాటు నిర్వహించాలి
పున్నమి అక్టోబర్ 31 గోదావరిఖని: ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏఐటీయూసీ రామగుండం నగర సమితి ఆధ్వర్యంలో గోదావరిఖని డిపో ముందున్న ఆర్ టి సి ఎంప్లాయిస్ యూనియన్ జెండాకు ఏఐటీయూసీ రామగుండం నగర కమిటీ ప్రధాన కార్యదర్శి శనగరపు చంద్రశేఖర్ ఏఐటీయూసీ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. బ్రిటీష్ పాలనలోనే కార్మిక హక్కుల కోసం, చట్టాల కోసం పోరాడి గత 100 సంవత్సరాలుగా సంవత్సరాలుగా 44 కార్మిక చట్టాలను సాధించింది ఏఐటీయూసీ. కానీ నేడు కేంద్రంలో బిజెపి మోడి ప్రభుత్వం కార్మిక హక్కులను హరించే విధంగా 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ తీసుకు వచ్చి వ్యాపారం సులభతరం చేసేందుకు ఆదా అని అంబానీలకు లాభం చేకూర్చే విధంగా కార్మికులకు ద్రోహం చేస్తుందని అవి రద్దు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని కార్మిక వర్గానికి పిలుపు నిచ్చారు. బొంబాయి నగరంలో 1920 అక్టోబర్ 31 వ తేదీన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు లాలా లజపతిరాయ్ అధ్యక్షతన ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) ఏర్పడిందని, నాటి నుంచి కార్మికవర్గ హక్కుల కోసమేగాక దేశ స్వాతంత్ర్యం కోసం అనేక పోరాటాలు చేసిందన్నారు. ఆ తర్వాత ఆధునిక భారతదేశ నిర్మాణం కోసం అద్వితీయమైన కృషి చేసి, అసాధారణ త్యాగాలు, బలిదానాలు, పోలీసు దాష్టీకాలు,పెట్టుబడుదార్ల గూండాల దాడులు, యావత్ జీవిత శిక్షలు, మరణ దండనలతో ఉన్న సమయంలో యావత్ కార్మిక,ప్రజల పక్షాన ఏఐటీయూసీ ముందుండి పోరాడిందన్నారు. కోట్లాది మంది కార్మికవర్గ గొంతుకగా వారి గుండెల్లో స్థానం సంపాదించుకుందని, ఏఐటీయూసీ ఒకానొక చారిత్రక నేపథ్యంలో ఏర్పడిందని వారు కొనియాడారు.సామ్రాజ్యవాదులు విధించిన నూతన రాజ్యాంగ చట్టానికి బదులుగా “వయోజన ఓటింగ్” హక్కుతో ఒక “రాజ్యాంగ సభ”ను ఏర్పాటు చేయాలని ఏఐటీయూసీ డిమాండ్ చేసిందన్నారు. సంపూర్ణ స్వాతంత్ర్యం అనే నినాదం ఈ డిమాండ్ ను మొదటి సారిగా లేవనెత్తిన ఘనత ఏఐటీయూసీకే దక్కుతుందన్నారు.ఏఐటీయూసీ స్వాతంత్య్ర పోరాటంలో కీలక భాగంగా వ్యవహరించింది. అందువల్లనే, స్వాతంత్ర్యానంతరం ఏర్పడిన తర్వాత రాజ్యాంగంలో కొన్ని కార్మిక హక్కులకు కొద్దిపాటి హామీలు కల్పించారన్నారు. గత 105 సంవత్సరాలుగా కార్మిక వర్గం అనేక పోరాటాలు, త్యాగాలు చేసి మరి కొన్ని హక్కులను సాధించుకోగలిగింది. కానీ వాటి అమలులో మాత్రం ప్రభుత్వాలు ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. న్యాయస్థానాలలోనూ కార్మికులకు సరైన న్యాయం దొరకటం లేదు. కేంద్రంలో నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత, 29 కార్మిక చట్టాలను రద్దుచేసి, 4 ‘కోడ్స్’గా అమల్లోకి తీసుకు వస్తున్నారు. కార్మిక వర్గాన్ని బ్రిటీష్ కాలం నాటి దుర్భర పరిస్థితికి నెట్టేస్తున్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం. *ఇప్పుడేమో నాలుగు కార్మిక కోడ్ల కొనసాగింపుగా “శ్రమ్ శక్తి ఎన్ఐటీఐ 2026” పేరుతో నూతన జాతీయ కార్మిక విధానాన్ని ముందుకు తీసుకొస్తున్నారని, వీటిని రద్దు చేయకుంటే పోరాటాలు తప్పవని ఏఐటీయూసీ రామగుండం నగర సమితి అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు అబ్దుల్ కరీం, శనిగరపు చంద్రశేఖర్ లు హెచ్చరించారు*. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు బిక్షపతి,మసూద్ దరిపెల్లి శ్రీనివాస్, మామిడిపల్లి శ్రీనివాస్, కార్మికులు శనిగరపు మతీనా ముర్స లీన్ శేఖర్ శంకర్ శనిగరపు తిరుమల, ఉషాకోయిలా రసజ్ఞ, బి అనిల్ కుమార్,కాసిపేట రాజేశ్వరి,రామగిరి లక్ష్మి, ఠాకూర్ కళావతి, పుల్యాల రాధా, బొందెల సంగీత, పొడి శెట్టి సుగుణ వసంత, పురుషోత్తం పావురం తదితరులు పాల్గొన్నారు.

